నికృష్టులారా!:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అన్యాయాలకు
పాల్పడితే
ఎదురుతిరుగుతా

అకృత్యాలకు
ఒడిగడితే
ఎండగడతా

అమానుషంగా
ప్రవర్తిస్తే
తగినబుద్ధిచెబుతా

నోరు
మూస్తే
విదిలించుకుంటా

కళ్ళు
కప్పితే
విరుచుకపడుతా

చేతులు
బందిస్తే
తెంపుకుంటా

కాళ్ళు
కట్టేస్తే
తెంచుకుంటా

తలుపులు
బిగిస్తే
పగులగొడతా

దొమ్మీకి
వస్తే
పోరాడుతా

డబ్బులు
ఎరచూపితే
ముఖంమీదకొడతా

అమాయుకులు
అయితే
దారికితీసుకొస్తా

పశువులు
అయితే
నాలుగుబాదుతా

రాక్షసులు
అయితే
శాస్తిచేస్తా

నలుగురుని
ప్రోగుచేస్తా
నికృష్టులపనిపడతా

ఆడవారికి
కొండంత
అండగానిలుస్తా

అణగారినివారికి
తోడ్పడుతా
అభివృద్ధిపరుస్తా

పేదవారిని
కూడుస్తా
ప్రోత్సహిస్తా

ప్రభుత్వాన్ని
ప్రశ్నిస్తా
ప్రజాస్వామ్యాన్నికాపాడుతా


కామెంట్‌లు