పుస్తక ప్రపంచం 38:- సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

1955లో పెడ్రో పారమో అనే పుస్తకం పబ్లిష్ అయ్యింది దీని రచయిత జువాన్ రోల్ ఫోన్ ఇది ఒక కల లాగా సాగిన కథ ఒక వ్యక్తి తనకు కనిపించకుండా పోయిన తండ్రి కోసం వెతికే తాపత్రయం.  ఇందులో మన సామాన్య ప్రపంచం నుంచి మనిషి చనిపోయాక చేరే యమలోకాన్ని గురించి రచయిత వర్ణించాడు 19వ శతాబ్దము చివర మెక్సికోలోని గ్రామీణ వాతావరణం 124 పేజీలలో చిత్రించాడు రాడికల్ సోషల్ ఎకనామిక్ మార్పు చేర్పులను ఈ కథలో చేర్చి ఆనాటి రైతులు బడుగు జీవులు మురికివాడ ప్రజలు ఎలా ఇతర ప్రాంతాలకి పని కోసం వలస వెళ్లారు ఆపై వారు పడిన తిప్పలను చాలా హృద్యంగా రాశాడు19 62లో సైలెంట్ స్ప్రింగ్ అనే నవలను రాఖేల్ కార్సన్ చాలా అద్భుతంగా రాసింది ఆ రోజుల్లోనే డిడిటి ఇతర క్రిమి కీటకాలను చంపే మందులను వాడరాదని ఆమె హెచ్చరించింది వాటివన్న జంతువులకు పక్షులకు అపకారం జరుగుతుందని కచ్చితంగా వర్ణించింది దీనివల్ల భూమి నిస్సారము అవుతుందని ప్రజలు తిండి దొరకక ఆహారం కోసం అలమటిస్తారని ఆమె అప్పుడే రాసింది వాతావరణ కాలుష్యానికి ఈ రకరకాల రసాయనిక మందులు వాడరాదని ఆమె హెచ్చరించింది🌹
కామెంట్‌లు