సింహం అడవికి రాజుగా ఉండేది. నక్క, కాకి దానికి అనుచర మంత్రులుగా పని చేసేవి . ఎప్పుడూ అడవిలోనే ఉండడం వలన వాటికి బోర్ కొట్టింది. ఓ రోజు కాకి సింహంతో " ఓ రాజా! మన అడవికి సమీపంలో ఉన్న ఎడారికి వ్యాహ్యళి కోసం పోయి వద్దాం. అక్కడ ఒంటెలు , ఒయాసిస్సులు ఉంటాయి. అవి చాలా పెద్దగా, అందంగా ఉంటాయి. అని చెప్పింది. కాకి మాటలు విన్న సింహం మరుసటి దినమే తన మంత్రులైన నక్క, కాకితో ఎడారికి బయలుదేరింది. వేడి ఇసుకలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత సింహం, నక్క కాళ్లు ఎండవేడికి కాలడం జరిగింది. దాంతో కాకి ఎగురుకుంటూ ఒంటె దగ్గరికి వెళ్లి " మిత్రమా! చూడడానికి ఎడారికి వచ్చిన మా రాజైన సింహాం,నక్క నడవలేక ఇబ్బంది పడుతున్నాయి. వాటిని నీవే కాపాడగలగాలి. అందుకు గాను వాటిని అడవిలో దించగలవా!? " అని ఎంతో వినయంగా అడిగింది.
వెంటనే ఒంటె " అయ్యో! అలాగా!... బాధలో ఉన్న వారిని ఆ మాత్రం ఆదుకోలేనా? " అంటూ ఆప్యాయంగా చెప్పి వాటి దగ్గరికి వెళ్ళింది. సింహం ,నక్క ఒంటెమీద ఎక్కి కూర్చోగా, అవి నివసించే అడవిలోని నివాస ప్రాంతానికి క్షేమంగా చేర్చింది. ఒంటె చేసిన సహాయానికి సింహం " మిత్రమా! నువ్వు కూడా మాతో పాటే హాయిగా అడవిలోనే ఉండవచ్చు. నీకు ఎలాంటి భయం లేదు. ఎడారిలో లేని ఆహారం ఇక్కడ బాగా దొరుకుతుంది " అని అంది. సింహం మాటలకు ఒంటె కొన్ని రోజులపాటు సరే అని ఒప్పుకుంది. సింహం తీసుకున్న నిర్ణయం జత్తుల మారి నక్కకు ఏమాత్రం నచ్చలేదు. మంత్రిగా తమ ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందోనని ఆందోళన చెందింది . దాంతో అది ఒక ఉపాయం పన్ని సింహంతో " మహారాజా! మీ కాళ్లు ఇప్పట్లో తగ్గేటట్టు లేదు. మీ ఆరోగ్యం కుదుటపడాలంటే మరి కొంత కాలం పట్టవచ్చు. మీరు ఆకలితో ఉండడం నేను చూడలేను. కాబట్టి నన్ను తినండి " అని అంది . ఆ మాటలు విన్న కాకికి అనుమానం వచ్చింది. వెంటనే కాకి రహస్యంగా ఒంటె చెవిలో ఏదో గుసగుస ముచ్చట చెప్పింది. ఒంటె " నక్కను వదిలేయి రాజా! మొదటి నుంచి నీకు నమ్మిన బంటు. నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను" అని సింహంతో పలుకుతూ ముందుకు వచ్చింది. నక్క, ఆ మాట ఒంటె ఎప్పుడంటుందా! అని ఎదురు చూడ సాగింది . ఆ మాట కోసమే నక్క నాటకమాడిందని సింహానికి అర్థమయిపోయింది. దాంతో సింహం" సరే! ఒక్కొక్కరూ వరుసగా నా వద్దకు రండి. చంపి ఆహారంగా తింటాను. అయితే ముందుగా చిన్న జీవి నుండి మొదలు పెడతాను. అందుకుగాను ముందుగా నువ్వు రా.. " అని నక్కతో అంది. ఆ మాట వినగానే ప్రాణభయంతో నక్క తనను ఎక్కడ తినేస్తుందోనని పరుగు పెట్టింది. నక్క కుట్రను అర్థం చేసుకున్నాయి. ఇక అప్పటినుండి కాకి, సింహం, ఒంటె మంచి స్నేహితులుగా మారి పోయాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి