తెలుగు భాష వెలుగు చూడు
తెలుగు అక్షరాలు నేర్చుకో
తెలుగు వెలుగు చూపుతూ
మలుపులెన్నో తిప్పుతుంది
అమ్మ అన్న పిలుపుతో
అ ,అక్షరం నేర్పుతుంది
అదే అమ్మ భాష తీపిదనం
అందిపుచ్చుకో ఆనందంగా
మన భాషలోని భావాలను
మనసు నిండా నింపుకోని
తియ్యని తెలుగు పలుకులను
అహ్లాదంగా పలికి వినిపించు
వీనులకు విందైన మన తెలుగు
కనులకు ఇంపైన తెలుగు భాష
తెలుగు భాష పదజాలాల అర్ధాలు
పర దేశాలలో తెలుగు వెలుగును చూపు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి