ఎద కోరే మధు సీమలనుండివ్యధ తీరే తీయని కబురుసుధలూరే మెత్తని పొట్లంగాతెస్తున్న వేకువ బండిలోకానికి కొత్త వెలుగులద్దినాకానికి చేరువ చేస్తానంటూశోకాలుండని క్షణాలు నింపిమనకోసం తెస్తున్న వెలుగుల బండిహరివిల్లు వర్ణాలున్నవిరిజల్లుల ముంచేస్తూదరి కొచ్చే సంతోషానమరి మరి ఊరిస్తూ...మరచిన కలలను సైతంమమకారంగా దాచిమాయగా దోసిట నింపిమనసుకు పండుగ తెస్తూవెతలన్నీ ఇక గతాలేనంటూకథలన్నీ మలుపులు తిప్పిబ్రతుకును బంగారు బాటగాకొరత లేక మలిచేస్తానని...కలిమి అంటే ఇక నీదేననికలలన్ని తీరే క్షణాలు మొదలనిమేలిమి వన్నెల నిజాన్నిచెలిమితో చెవిలో చెప్పాలని వచ్చేవిలువైన వేకువకు🌸🌸సుప్రభాతం🌸🌸
సుప్రభాత కవిత : - బృంద
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి