కొండ కోనల్లో హాయిగా విరిసే
పండగంటి చిన్ని పువ్వు అందం
వెండి మబ్బుల దారిలో
నిండుగా పరచుకున్న నీలం..
ఎత్తున బాధ్యతగా నిలబడి
మొత్తం నేలను గమనించే గిరులు
నట్టింట సందడిగా తుళ్ళుతూ
చిట్టిపాపలా కలయ తిరిగే గాలి
కాలానుసారము సోయగాలు సంతరించుకుని మెరిసే ప్రకృతి
అడుగు వెంటే అడుగులా
చీకటిని తరిమే వెలుగులా..
అండగా వుండే గొడుగులా
మార్పును తెచ్చే రేపటిపై ఆశ!
మనసును మురిపించె వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి