సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
================
అత్యంత ప్రియమైన తరువు రాణీ!
పచ్చని చీర గట్టి, పెరట్లో కొలువున్నావు.
వేకువనే లేవగానే శుభోదయం చెప్పేవు,
నీ చిట్టి చిట్టి చేతులను ఊపుకుంటూ.
.మారేడుగా నీవు, ఔషధీ గుణాలతో,
శివునికి ప్రీతిపాత్రమై వెలిగేవు.
తులసిగా మాచేత పూజలందుతూ,
సకలదేవతల ప్రీతి పాత్రమైనావు.
ఆమ్ర వృక్షంబువై లేలేత చిగురులతో,
కోయిలల ఘనముగా స్వాగతించేవు.
జామ చెట్టుగ నీవు ఫలముల నందించి,
మధుమేహులకుముదమునిచ్చినావు.
వేప వృక్షంబువై ఆమ్లజని నందించి,
ఆయురారోగ్యాలు పెంచి నావు.
ఎండబడి వచ్చిన, వారికి నీడనిచ్చి,
అక్కున చేర్చుకొని సేద దీర్చేవు.
ఒకటి రెండు కాదు _వేల లాభంబులు!
నిన్ను చూసిన చాలు, తనివి తీరుతుంది
రాళ్ళతో కొట్టి, రంపాలతోకోసే
దుష్ట జనులనుండి రక్షింతు నిన్ను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి