సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
===================
ప్రతీ చెట్టుకు ఓ కథ ఉంటుంది.....
పంచభూతాల ఒడిలో...
ముద్దుగా పెరిగిన ఓ తరువు !
ప్రకృతి అందచందాలకు...
నీ పచ్చదన సోయగమే నెలవు !
సకల జీవుల జీవితాలకు...
ఆరోగ్యమునిచ్చే జీవన వాయువు !
మానవాళి మనుగడకు...
ఈ లోకాన సర్వకాలల్లో నీవే ఆదరువు !!
మా అందరికీ ఫలాలు యిస్తావు...
అయినా, నీకు రాళ్ళ దెబ్బలు తప్పవు !
మా అందరికీ ఎంతో నీడనిస్తావు..
అయినా, నీ కష్టాలు మాత్రం మాతో చెప్పవు !
మా జీవితమంతా తోడు-నీడైన మిత్రుడవు...
అయినా, మా నుంచి మాత్రం ఏమి కోరుకోవు !
మా నిర్లక్ష్యానికి, స్వార్థానికి బలైపోతావు...
అయినా,మాతో కాటికొచ్చి ఆహుతవుతావు !!
జీవరాశికి సేవ చేయడమే నీ జీవితం !
నిస్వార్థ సేవకే నీ జీవితకాలం అంకితం !
అపకారికి ఉపకారం చేయడమే నీ మతం !
అందరినీ సదా సేదతీర్చడమే నీ అభిమతం !
నీ జీవిత పరమార్ధం మాకు అమృత పూరితం !!
తరాలు ముగిసి పోయినా..
నీ ఉనికి మాసిపోదు !
చరిత్ర చెరిగి పోయినా...
నీ కథ సమసి పోదు !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి