ప్రబోధ గీతి మాల:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
శాంతంతో చేసే
పనులన్నీ సఫలము
చేకూర్చును విజయము
పంచునోయి మోదము

కోపంతో చేసే
ఏవైనా విఫలము
నొచ్చుకొనును హృదయము
ఇవ్వవు సత్ఫలితము

ప్రణాళిక అవసరము
లేక కకావికలము
పరిపూర్ణత రాదు
ప్రయోజనమే లేదు

మాట్లాడే ముందుర
యోచించు కాసింత
ఆపదలో ఉంటే
ఇవ్వాలి చేయూత


కామెంట్‌లు