మహాత్ముల మాటలు:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
మహనీయుల పలుకులు

కాంతులీప్రమిదలు
గైకుంటే మాత్రం
జీవితాన వెలుగులు

పసి పాప నవ్వులా
వికసించిన పువ్వులా
పెద్ద వారి మాటలు
వెన్నెల్లా సొగసులు

గురుదేవుల బోధలా
దిద్దుతాయి బ్రతుకులు
రవి కిరణం కాంతిలా
తరుముతాయి మబ్బులు

మహాత్ముల మాటలే
అపరంజి మూటలే
అర్థము చేసుకుంటే
అగును బ్రతుకు బాటలే

కామెంట్‌లు