సాహితీ కవి కెరటాలు
================
పెదవి దాటని పదాలు...
మదిలో నిండిన మోహావేశాలు...
హృదయంలో ఉప్పొంగే పరవశాలు...
వర్ణనకు అందని ఉప్పెన లాంటి సంతోషాలు...
మౌనంగా రాశాను నీకు ప్రేమలేఖలు!
ఈ సూర్యోదయపు వేళ, మంచు కురుస్తోంది చిరువర్షం వలె!
పక్షులు శబ్దం చేస్తున్నాయి, మంగళ వాయిద్యాల వలె!
పిల్ల తెమ్మరలు, హిమపవనములు వలె గమనం సాగిస్తుండగా...
నా మదిలో నీ ప్రేమ కావ్యాలు, దీపం వలె వెలుగురేఖలు ప్రసరించగా...
నా ఆలోచనలు, ఎదలో పువ్వుల వలె సోయగాలు వెదజల్లే!
నీ మొహాలు, ముత్యాల చినుకులు వలె తడుపుచుండగా...
నీ చిరు చిరు స్పర్శలు, నెమలీ ఈకలు వలె సుకుమారంగా నన్ను సృజించగా...
నీ సంభాషణలు, అమృతం వలె నాకు జీవనరసాలను రమ్యంగా పంచగా...
పరవశాల మొహాల మత్తులో, గమ్మత్తైన తుమ్మెద వలె విహరించనా?
నీ మధురభాషణములు మాణిక్యములు, అవి నా మదిలో గూడు కట్టుకున్న అమృతకలశాలు!
రంగురంగుల బంగారం లాంటి పుష్పాలు, నా మేనిపై ఆభరణాల వలె అలంకరించగా...
నేను మహారాణి వలె, నీ గుండె గదుల్లో నడయాడనా?
చకోర పక్షి వలె నేను నీ కోసం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి