బోళా శంకరుడు :- డా. ఆళ్ళ నాగేశ్వరరావు (కమల శ్రీ )తెనాలి

 సాహితీ కవి కళాపీఠం 
సాహితీ కెరటాలు 
==================
పార్వతికి పతి యై..
గణపతికి పిత యై...
త్రినేత్ర ధారి యై...
తలపై గంగతో...
కరమున త్రిశులంతో...
గరళాన్ని కంఠంలోనే ఉంచుకున్న జగద్రక్షుడై..
త్రిలోక సంచారి యై...
విభూది ప్రీతిపాత్రుడై...
తన ఆజ్ఞతో త్రిలోక పాలకుడై...
స్థితి, లయకారకుడై...
జలాభిషేక ప్రేమికుడై...
భక్తజన కొంగు బంగారమై...
నిశ్చల తపముకు ప్రత్యక్షమయ్యే బోళా శంకరుడై...
వెనకా ముందు అలోచించిక వరాలనిచ్చి,  
కష్ఠాలను కొని తెచ్చుకునే భక్త జన పాలకుడై...
"" ఓం నమశివాయ"" అను పిలుపుకు పలికే భక్త జన హృదయధారి,
సర్వ లోకేశ్వరుడు ఈశ్వరుడు!!!
-----------------------------------
కామెంట్‌లు