ఎందుకిలా?:- సత్యవాణి

 ఎందుకిలా మారిపోయింది              
 ఈ దేశపు యువత
మంచేదో చెడేదో
తప్పేదో ఒప్పేదో గమనించలేకుండా
పోతోందేమిటి
మత్తులో తూగడమేమిటి
చెత్తచెత్తగా నోటికొచ్చినట్లువాగడమేమిటి
ఎటువైపుగా నడుస్తోందీ యువత
నడి బజారులలో కత్తులతో ఆలా వీరంగమాడట మేమిటి
కుత్తుకలను తెగనరుకుతామని కూయడమేమిటి
ఏమైయ్యిందీనాటి  యువతకు
అన్యాయలకు కొమ్ముకాయడమేమిటి
అసత్యాలను భుజాన వేసుకొనిమోయడ మేమిటి
వివేకం విడచి వెళ్ళిపోయిందా యువతను
విౙానం వారి 
మెదడు వరకూ చేరటంలేదా
అౙానమే వారి
మెదడులో పీఠమేసుకొని కూర్చుని నడిపిస్తోందా వారిని
ఏరీ ఆనాటి భగత్ సింగులు
ఏరీ రాజ్ గురులు
ఏరీ వివేకానందులు
సీతారామరాజులెక్కడ
ఆజాద్ లు ఏరీ
దేశంకోసం దేహాన్ని 
త్యాగంచేయగల యవత శాతమెంత ఈనాడీదేశంలో
మార్చండి పాఠ్యాంశాలను
దేశభక్తుల కథలను
వారి త్యాగలను
ప్రధాన పాఠ్యాంశాలుగా చేర్చండి
తరగతులవారీగా
మన దేశపు రాజ్యాంగ నియమ నిబంధనలను పరిచయం చేయండి
వారివారి హక్కలతోపాటు బాధ్యతలనూ గుర్తెరిగించండి
రాజ్యాంగాన్ని ధిక్కరిస్తే
పడేశిక్షలనూ పాఠాలలో చేర్చండి
ఏ ఏ నేరాలకు ఏ ఏ శిక్షలు అమలుచేయబడతాయో
రహదారి కూడళ్ళలో వ్రాసి ప్రదర్శించండి
ఖాళీగావుంచకండి యువతను
పనిపాటలు లేని యువత మెదడు చెదపుట్ట వంటిది
కౄర సర్పాలాపుట్టలలో ప్రవేశిస్తాయి
విషమెక్కిస్తాయి యువత మెదడుకు
ఆ ఎక్కినవిషమే క్కుతుదీ యువత
చెరుపు చేస్తుదీ సమాజానికది కల్పించండి పని యువతకు
ఖాళీ ఏమాత్రం లేకుండా
పనిలేని యువత మెదడు
పశువు మెదడుతో సమానం
పశువుకీ పనిలేని యువతకూ తేడా ఒకటే
పశువు అడ్డమైన గడ్డీ ముట్టదు
పనిపాటులు చేయని
యువతకా నియమం ఏమాత్రంలేదు
                
కామెంట్‌లు