బాల్యంలో డాబా మీద పడుక్కునిపున్నమి వెన్నెల తారలను చూసిమనసు పడ్డాను అంతరిక్ష పరిశోధన చేయాలనిడిగ్రీ చదువులో నే తండ్రి మరణంతో గుమస్తాగామారెను...!!కులమత భేధాలు వర్ణవివక్షతలకు,స్త్రీ జనోద్ధరణకోసం పోరాడినకందుకూరి, వావిలాల,దుర్గాబాయ్అడుగు జాడల్లో నడవలనుకున్నాసంసార భాద్యతలతో సతమతమవుతుస్వంత ఇంట్లో మనుషులనే మార్చలేక ఛతికిల బడ్డాను.!!నేను చదువును మధ్యలో ఆపేసినాకన్నకొడుకు ఉన్నతంగా చదవాలని మనసుపడిఇంజనీరింగ్ లో చేర్పించాను.విప్లవమే ధ్యేయంగా మధ్యలో చదువు మానిప్రజాపోరాటంలోపోలీసుల బులెట్ కి బలి అయినపుడు పడిన భాధ వర్ణనాతీతం....!!వృద్ధాప్యంలో మనసు పడ్డాకంటికి రెప్పలా కష్టసుఖాలలోతోడు నీడగా ఉండే భార్యకన్నా ముందే పరమాత్ముని చెంత చేరాలనివిధి బలీయం నాకన్నా ముందే మనసున మనసైజీవించిన భార్య అర్ధాంతరంగా నన్ను శాశ్వతంగా వదలిన సమయాన మనసన్నదే మూగ బోయింది....!!................................
జీవితమే ఒక స్వప్నం:- అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి) -విశాఖపట్నం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి