పిక్నిక్ లు.....!:-కోరాడ నరసింహా రావు .
పదుగురూ కలిసి...
   రొటీన్ నుండి బయటపడుతూ...
   చీకాకులన్నీ మరిచి...
  హాయిగా...ఆనందంగా...
  ఆడుతూ....పాడుతూ...
విందులూ...వినోదాలతో...
 ఊరికి దూరంగా....
  ఆహ్లాదకర వాతావరణంలో...
  పచ్చని తోటలు... చెట్ల నడుమ....
  గడపటమే.... పిక్నిక్...!

పిక్నిక్ లు ..... కొత్త ఉత్సాహానికి ఊపిరులు...!
  నూత్న చైతన్య ప్రదాయినులు...!!

అందుకే...మన ఆచార,సాంప్రదాయాలలో...పిక్నిక్ లు భాగమైపోయాయి...!

విసిగి వేసారిపోతున్న నేటి జీవన విధానానికి...
   పిక్నిక్ లు గొప్ప టానిక్లు !!

చిన్నా,పెద్ద...ఆడా,మగా...
బాలలు...వృద్ధులు... తేడాలన్నీ మరచిపోయి...
  హాయిగా ఆనందించే అవకాశాలు ఈ పిక్నిక్ లు!
      *****

కామెంట్‌లు