ఆరవై ఏండ్లనాటి స్నేహం
ఆరవ ఏట ఒకటో తరగతిలో
అనకాపల్లిలో మొదలైన మా స్నేహం
ఏడుపదుల వయస్సులోకూడా
సుమతీ, దాశరధి శతకాలతో
రామాయణ ,మహాభారత గ్రంధాలతో
నేటి సామాజిక పరిస్థితులకనుగుణంగా
సనాతన ధర్మానికి ప్రతీకగా
సామాజిక రచనలు చేస్తున్న
సాహితీ మిత్రుడు ఇవటూరి గౌరీశం తాను రచించిన
శ్రీరామ పద్య మణి మంజరి,
శివభావనా లహరి పుస్తకాలను
విశాఖపట్నం కుర్తాళం పీఠం ఆధ్వర్యంలోని
లలితాపీఠంలో
ఆప్యాయతతో అందించి
శివకేశవులకు అబేధ0 లేదని
ఏభై ఏండ్ల క్రిందట నువ్వు చెప్పిన
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణో
విష్ణోస్య హృదయం శివః అన్నది పుస్తకాలలో ప్రస్తుతించాను
మిత్రమా చదివి చెప్పని
అమెరికా నుంచి వచ్చానని తెలిసి
మండు టెండలో
ఏరువాక పౌర్ణమి రోజున
సద్గురు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి చిత్రం ఎదురుగా ఇచ్చినపుడు అనుకున్నా
"సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్" అన్నది అక్షర సత్యం....!!
..........................
సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్:- కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి