కూలిన విమానం!:-ఎం. వి.ఉమాదేవి

ఆట వెలదులు 

బయలుదేరి నంత బావురు మనిపించె 
కూలినట్టి తీరు ఘోరమాయె?
శోకసంద్రమాయె సున్నిత హృదయము
కారణమ్మదేమి కనకదుర్గ!

మేధరూపమైన మేటి యువతరమ్ము 
సాధనమ్ము నాపి క్షుధనుజేరి 
తినుచునుండగానె తీసుకు వెళ్లేవు 
సాంబశివుడ తమకు సరియిదెట్లు?!
కామెంట్‌లు