చిధిలావస్థల మధ్య:-పోలగాని భానుతేజశ్రీ (భానోదయం) కృష్ణాజిల్లా
 సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు 
=============
తొలి పలుకులుగా ఎదలోతుల్లో మిగిలిపోయిన కొన్ని మధుర స్మృతులను తట్టిలేపాను 
తేరిపారి నన్ను చూసి నల్లటి మబ్బుల్లా నా కళ్ళను కమ్మేశాయి 
గుండె బరువెక్కి పోయింది
గతకాలపు జ్ఞాపకాలన్నీ కనుల ముందు ప్రత్యక్షమవుతుంటే 
వీడిపోనని కలిపిన చేయి, వదిలిపోయి ఎంతకాలమయిందో
 
మాటలన్నీ కరువయ్యాయి, చేతలన్నీ చెమ్మగిల్లాయి 
నా జీవితాన్ని తనకై అర్పించిన ఆ రూపం 
చిథిలావస్థల మధ్య నా వైపు చూస్తూ చిత్రంగా నవ్వుతుంది 
మన్నులో కలిసిపోయినా నిన్ను మరువలేదే అంటూ ముసి ముసి నవ్వులు చిందిస్తుంది....
****


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
కవిత చాలా బాగుంది