చేట్టమ్మ నీ పాదాలకు వందనం:-చుంచు సంతోష్ కుమార్- సిద్దిపేట
సాహితీ కెరటాలు .
=================

కనిపించని జీవపు వాయువువై ..
తనువు దేహంలోని
గుప్పెడు గుండెకు ఊపిరి పోస్తావు 
తనలోన ఉద్భవించే భావాలను
పలకరిస్తావు రాకపోకల చుట్టం వై ..
చేట్టమ్మ నీకు చేతులెత్తి మొక్కలే ..!!

నా గొడ్డలి వేటుకి నేలకూలుతావు 
పచ్చని ప్రాణం వదిలిన సేవమై ..
ఎండుకొమ్మల నిర్జీవపు దేహానివై
నా పొట్టకి తీపి కూడు అందిస్తావు
పొయ్యి మంటల్లో నిలువెల్లా నీవు కాలిపోతూ
చేట్టమ్మ నీకు చేతులెత్తి మొక్కలే ..!!

రోగాలకు ఔషధం నీవు ఈ సృష్టిని రక్షిస్తావు
నీవుంటే అందం లేనిచోట విలవిలాడుతుంది 
జీవ ప్రాణం
నీ రూపాలన్ని ఈ లోకం కోసం
చేట్టమ్మ నీకు చేతులెత్తి మొక్కాలి ..

___________ . 

కామెంట్‌లు