సుప్రభాత కవిత : -బృంద
శిఖరాల నడుమ 
పగడాల బంతి
తిమిరాలు పొ ద్రోల
ప్రభవించెనదిగో.....

గగనాల వీధుల 
వర్ణాలు నింపుతూ 
భువనాన్ని వెలిగించ
వచ్చెనదిగో....

నిదరోవు  ఇలకు 
ఉదయాలు తెస్తూ 
చివురించు ఆశలు
చిలికించెనదిగో....

మొదలైన దినమును
విలువైన వరముగాఎంచి 
విజయపథము  వెంట
నడచి పొమ్మనెనదిగో...

వ్యధలు తొలగించి 
దిశలు నిర్దేశించి 
కథలు మార్చే వేకువ
కనిపించెనదిగో...

సత్యమును గ్రహించే


చీకటి తప్పించు వెలుగై
సత్యపు దారిని నడిపించి 
ఎప్పటికీ  వాడని బ్రతుకునిచ్చు
భవ్యమైన ఉషోదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు