ఓ నాన్నా!:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నాకు 
ఏపేరుపెడతావు నాన్నా!
నన్ను
ఎంతప్రేమగాపిలుస్తావు నాన్నా!

తాతపేరు
పెడతావా
దేవునిపేరు
పెడతావా

పెద్దపేరు
పెడతావా
చిన్నపేరు
పెడతావా

బుజ్జీ
అంటావా
బంగారం
అంటావా

నీ ఇష్టప్రకారం
పెడతావా
అమ్మ కోరికప్రకారం
పెడతావా

జ్యోతిష్యం ప్రకారము
పెడతావా
ఆశయం మేరకు
పెడతావా

పేరును విరిసి
పిలుస్తావా
లేకసాగదీసి
పిలుస్తావా

బారసాలరోజు
పెడతావా
అన్నప్రాసనరోజు
పెడతావా

ముద్దుగా
పిలుస్తావా
కోపంగా
పిలుస్తావా

నాన్నా! నాపేరును
నన్నే పెట్టించుకోనీయరాదు
మానాన్న బహుమంచివాడు
నాకోరిక మన్నిస్తాడంటాను


కామెంట్‌లు