నాన్న:- డా.రామక కృష్ణమూర్తి

 అవును నాన్న నాన్నే
అగాథాలెన్నింటినో కళ్ళ వెనక దాచి,
చెలియలికట్ట దాటనివ్వని బాష్పాలను కూడ ఘనీభవింపజేసి,
గాంభీర్యం వెనక వాత్సల్యాన్ని నిలిపి,
సదా నిరాకారుడై కనబడే మృన్మయమూర్తి,
బాధ్యత నేర్పుతూ బడిపంతులై,
బలీయమైన భావాలను చేతనుడై నడిపిస్తాడు.
గడియారానికి పర్యాయపదం తానై దర్శనమిస్తాడు.
నిరంతర నిర్మాణకౌశలుడై భాసిస్తాడు.
అనంతమైన ప్రేమను గుండెల కింద స్థిరీకరించి,
అనన్యసామాన్యమైన సమర్థతను చూపిస్తాడు.
ధృతి కల్పించి నడిపే నేస్తమవుతాడు.
నాన్నా అంటే చాలు నేనున్నానంటూ ప్రత్యక్షమవుతాడు.
కామెంట్‌లు