సోమరితనం గిట్టని డేగ:- - యామిజాల జగదీశ్
 డేగ సోమరి పిల్లలను పెంచదు. ఏ మాత్రమూ కష్టపడకుండా ఉన్న చోటే ఉండి సౌకర్యాలను అనుభవించేలా తన పిల్లలను పెంచదు. ఆకాశ యోధులను పెంచుతుంది. 
పిల్ల డేగ ఎప్పుడైతే ఎగరటం మొదలవుతుంది ఓ అప్పుడు దానిని ముద్దు చేయడం మానేస్తుంది. అంతేకాదు, గూటిలో అప్పటి వరకూ ఉన్న మృదువైన ఈకలను బయటకు తీసేస్తుంది, ముళ్ళను మాత్రమే వదిలి వేస్తుంది. ఎందుకూ? 
ఎందుకంటే ముద్దుముద్దుగా చూస్తూ  బతకటం నేర్పదు. శ్రమించాలి, బతకాలి అనే తత్వంతో నడిపిస్తుంది.
ఒకప్పుడు హాయిగా తల దాచుకున్న గూడే ఉచ్చుగా మారుతుంది. గారాబం పనికి రాదని తల్లి డేగ దానిని బహిరంగ ప్రదేశంలోకి నెట్టివేస్తుంది.
అవును, ఆమె తన సొంత పిల్లనే ఆకాశంలోకి విసిరేస్తుంది.
హెచ్చరికలు ఉండవు. అయ్యో అని బాధపడడాలుండవు. ఎందుకంటే తల్లికి తెలుసు: ఎగరాలి...బతకాలి...ఇవి మరో తప్ప వేరే మార్గం లేదన్నట్లు వ్యవహరిస్తుంది. రెక్కలూ చూపూ ప్రధానం.
ఖచ్చితంగా, పిల్ల డేగ పడిపోతుంది. వెంటనే తల్లి దానిని పట్టుకుని పైకి లేపుతుంది. మళ్ళీ విసురుతుంది. మళ్ళీ మళ్ళీ అలానే చేస్తుంది. అది ఎగరటం నేర్చుకునే వరకూ ఈ తీరు కొనసాగుతుంది.
డేగలు సోమరితనాన్ని పెంచవు. సోమరితనానికి బుద్ది శత్రువు. భయాన్ని బోధించవు. పోరాడు జీవించు అనేలా పెంచుతుంది.
ఎందుకంటే జీవితంలో, నిజమైన ప్రేమ మరింత ఓదార్పు గురించి కాదు. అది మీ స్వంత రెక్కల శక్తేమిటో తెలుసుకునేలా చేస్తుంది. అందుకవసరమయ్యే రీతిలో దోహదపడుతుంది. 
స్వయం శక్తి ప్రధానమనేలా పెంచే డేగను దీపకం, పత్రి, శ్యేనం, సారంగం, జాలె, కణుజు, వేసాడు, అణుజు, లాగుడు, బైరి, గ్రద్ద అని కూడా అంటారు. నిజమైన డేగలు అక్విలా జాతికిందకొస్తాయి. పేగులో 68 జాతులున్నాయి. వీటిలో ఎక్కువ భాగం యురేషియా, ఆఫ్రికాకు చెందినవే. ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాలలో ఇవి అధికం.
డేగ సుమారు 50 సెంటీమీటర్ల పొడవుంటుంది.
ఆంగ్లంలో "ఈగిల్" అని అంటారు. ఈ పదం ఐగల్ నుండి వచ్చింది.
ఇది శక్తిమంతమైనది.  వేటాడే పక్షి. దీని తొలి భాగం బరువైనది. 
సాధారణంగా దీని ముక్కు ఇతర వేటాడే పక్షుల కంటే బరువైనది. వీటి కళ్ళు చాలా శక్తివంతమైనవి. చీలిక తోక గల ఈగల్స్ సాధారణ మానవుడి కంటే రెండు రెట్లు దృశ్య తీక్షణతను కలిగి ఉంటాయని అంచనా. ఈ తీక్షణతవల్ల చాలా దూరం నుండి ఎరను గుర్తించే సామర్థ్యాన్ని అందిస్తుంది. అయితే అతినీలలోహిత కాంతిని చూడగల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. డేగలలో ఆడది మగదాని కంటే పెద్దది. 
ఇవి సాధారణంగా తమ గూళ్ళను ఎత్తైన చెట్లపైనా లేదా ఎత్తైన కొండలపైనా ఏర్పాటు చేసుకుంటాయి. 
డేగలోని చాలా జాతులు రెండేసి గుడ్లు పెడతాయి.
డేగలు తుఫానుల సమయంలో ఎగురుతాయి. హలియాయిటస్, ఇక్థియోఫాగా డేగలు చేపలను పట్టుకోవడానికి ఇష్టపడతాయి.  క్లెప్టోపరాసైట్‌లు, సిర్కేటస్ , టెరాథోపియస్, స్పిలోర్నిస్ జాతులకు చెందినవి ప్రధానంగా పాములను వేటాడతాయి. అక్విలా జాతికి చెందిన డేగలు తరచుగా బహిరంగ ఆవాసాలలో వేటాడే పక్షులలో అగ్రస్థానంలో ఉంటాయి. 
డేగ జీవితకాలం సాధారణంగా 20 నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే, కొన్ని జాతులు 70 సంవత్సరాల వరకు కూడా జీవించగలవు. 

కామెంట్‌లు