నాన్నా వింటున్నావా?:- Dr. C వసుంధర-చెన్నై

 నాన్న నేను చెప్పేది విను 
నీ జీవిత పుస్తకంలో ఒక్కొక్క పేజీ చదువుతుంటాను విను 
నువ్వు ఓ ఇంటి వాడివై ఓ తండ్రిగా  మారావు. నన్ను చెల్లిని సాకడానికి నీవు పడ్డ పాట్లు అగచాట్లు కోట్లు
నాలాగా వర్క్ ఫ్రమ్ హోం కాదు నీ పని.సైకిల్  నీ  ఓర్పును కిల్ చేసినా దాన్ని తొక్కుతూ వెళ్లాలి ఆఫీసుకు.
 అకలేసినా అణిచిపెట్టీ ఉన్న డబ్బుతో కొనేవాడవి సరుకులు కూరలు.
మాతో ఆడాలన్న అశ నిరాసైతే, టా టా పిల్లలు అన్నదే దినసరి స్లోగన్.
అమ్మ విసుగుళ్ళు, నానమ్మ తిట్లు,తాతయ్య నసుగుడు అన్నిటినీ నీ తలలో దాచిపెట్టుకొని చిరునవ్వు వాళ్లకు
కానుకగా ఇచ్చిన శాంత మూర్తివి నువ్వు. నీ జీవిత పుస్తకంలో నీకంటూ ఒక్క పేజికూడ లేదు న్నాన్న! దైవానికన్న స్వార్థం ఉంటుందేమో
నాన్నా! నీలాంటి మంచి నాన్నలకు స్వార్థం
శూన్యం. మానాన్న అన్ని చేస్తాడులే అనుకొన్నాను గాని ఇప్పటివరకు నాన్నకు ఎవరు ఆనందాన్ని సౌఖ్యాన్ని ఇస్తారు అని నేనే కాదు యింట్లో ఎవ్వరూ ఆలోచించ లేదు నాన్నా!
మేం ఆలోచించేసరికి నీ జీవితం చివరకొచ్చింది.ఏ దడిగినా ""నాకెందుకురా! అవన్నీ"అంటున్నావు. మరి నికు నేనేం ఇవ్వను? రెండు కన్నీటి బొట్లు తప్ప. నాన్నా!నన్ను మన్నించు. మరు జన్మలో నీకు నాన్ననై 
నీరుణం తీర్చుకొంటా.ఈజన్మలో నీసేవ చేసుకొంటా.
కామెంట్‌లు