మద్దికొండ రాజ్యాన్ని విమలవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. రాజ్యంలో ఒక యేడు విపరీతంగా కరువు ఏర్పడ్డది. ప్రజలంతా కష్టాల్లో కూరుకపోయారు. మహారాజు విమలవర్మ దానధర్మాల మూలంగా రాజ్య ఖజానా కూడా ఖాళీ అయింది. ప్రజలు ఆకలికి అలమటిస్తూ, అరిగోస పడుతున్నారు. ఉన్నదంతా ఇరుగుపొరుగు రాజ్యాలకు దానధర్మాలతో మహారాజు రాజ్య ప్రజలను పట్టించుకోలేదని, ఇక రాజ్యంలో ఉండలేమని మహారాజును నిందిస్తూ, నలువైపులా పొరుగు రాజ్యాలకు ప్రజలంతా వలస వెళ్లారు.
పొరుగు రాజ్యాలకు వలస వెళ్తున్నారు కానీ పరిచయం లేని ప్రజల వద్ద ఎక్కడ నివాసం ఉండాలి. కూలీ పనులు ఎవరిని అడగాలో అర్థం గాక తికమక పడుతూ వెళ్లారు. పొరుగు రాజ్యాల ప్రజలు వలస వచ్చిన ప్రజల వివరాలు తెలుసుకుని, వారు మద్దికొండ రాజ్య ప్రజలు అనగానే నివాసం కల్పించి, భోజన సదుపాయం అందించారు. ప్రజలు ఏవైపు వెళ్ళినవారికి అక్కడి రాజ్యంలోనే ఆశ్రయం పొందారు.
ఆ రాజ్య ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి పొలాలలో కూలీ పనులు చేస్తూ, చక్కని బంధుత్వంలా కలిసిమెలిసి ఉన్నారు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. మద్దికుంట రాజ్యంలో భారీ వర్షాలు కురవడంతో ప్రజలంతా తిరుగు ప్రయాణం పట్టారు. ప్రజలంతా నేరుగా మహారాజు విమలవర్మ వద్దకు వెళ్లి, తమ తప్పుకు క్షమించమన్నారు. ఇరుగుపొరుగు రాజ్యాలకు మీరు దానధర్మాలు చేసి, వారిని కరువు నుంచి రక్షించడం మూలంగా మమ్మల్ని ఈరోజు ఎలాంటి లోటులేకుండా బంధువుల్లా చూసుకున్నారు. మీ దానధర్మాలు మా వలసలకు రక్షణ కల్పించాయని దండాలు పెట్టారు. మహారాజు విమలవర్మ ప్రజలందరికీ నమస్కారిస్తూ, ఇరుగుపొరుగు రాజ్య ప్రజలతో ఏర్పరచుకున్న బంధుత్వం ఎప్పటికి సాగించమంటూ, బతికినన్నినాళ్ళు అందరూ కలిసి సాగాలనగానే, ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ తమ నివాసాలకు వెళ్లారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి