ప్రాసమంజరి:-నూతన సాహిత్య పద్య ప్రక్రియ:-రూపకర్త డా. ధనాశి ఉషారాణి
 దేశ భాషలలో తెలుగుభాషన చరించు
తెలుగునే మాట్లాడుతెలుగున నేచరించు
కష్టనష్టాలు మాతృభాషలో చర్చించు
మనోభావాంతరంగాలు తెలుగు లోచర్చించు


తెలుగు కావ్యఖ్యాతి నంతటా వినిపించు
పద్యాల లోనే కమ్ర రుచులనిల గాంచు
తెలుగు నపద్యమాధుర్యతను మరువక గాంచు
పద్యమాధుర్యతా మహిమనే నిల గాంచు

తెలుగు పద్యరుచులు అనుభ వించగగాంచు
తెలుగు సామెతలనిల వాడు తూ ఆచరించు
తెలుగు నుడికారజాతీయము లాచరించు
తెలుగునజీవించు అందులోనే చరించు
========================
ప్రాసమంజరి రూపకర్త
 డా. ధనాశి ఉషారాణి
తిరుపతి జిల్లా
భాకరాపేట

కామెంట్‌లు