ఎదురు చూపులు:- డా జి భవానీ కృష్ణమూర్తి
సాహితి కవి కళాపీఠం 
సాహితి కెరటాలు
================
చూపులేమో శూన్యంలో...
పరుగులు పెట్టే ఆలోచనలు గతంలోకి....

అందమైన బృందావనంలో
రాధాకృష్ణుల్లా రాసలీలల్లో
తేలియాడినమనం..

చక్కని ఆకాశహార్మ్యములెన్నో
నిర్మించుకున్న మనం...

 చదువు కోసం అంటూ
సుదూరతీరాల్లో నువ్వు..

సిరిమల్లె తోటలో ఒంటరిగా నేను...

ఎన్నాళ్ళీ విరహం..?.
ఎంతకాలమీ ఒంటరి పయనం?

ఆకలి దప్పులు మరచి
బాల్యస్మృతులే ఆలంబనగా

నీ రాకకై ఎదురు చూస్తున్న మరుమల్లెని...
నీ సిరిమల్లెని  

దూరాల దారాలను కలిపే
ఆ దేముడు మనిద్దరినీ కలిపే శుభ ఘడియకై..

ఎదురు చూస్తున్నా...


కామెంట్‌లు