కొత్తూరు కవనం సంకలనాల బహూకరణ

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో విచ్చేసిన ప్రముఖులందరికీ కొత్తూరు కవనం సంకలనాలను బహూకరించినట్లు, కొత్తూరు రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు తెలిపారు. సభాధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సహోపాధ్యాయులు బొమ్మాళి వెంకటరమణ, పెయ్యల రాజశేఖరం, జక్కర వెంకటరావు, పడాల సునీల్, ముదిల శంకరరావు, యెన్ని రామకృష్ణ,  గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, మాచర్ల గీత, మజ్జి శంకరరావు, వసంత రాజారావు, జి.నరేష్ రామ్ జీ, యందవ నరేంద్ర కుమార్, బోధనేతర సిబ్బంది సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలకు బహూకరించారు. ఆహ్వానితులుగా విచ్చేసిన తూతిక సురేష్, దార జ్యోతి, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, జన్ని చిన్నయ్య, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, రబికుమార్ మహాపాత్రో తదితరులకు కూడా ఈ సంకలనాలను బహూకరించినట్లు తిరుమలరావు తెలిపారు. ఈ కొత్తూరు కవనం సంకలనంలో కుదమ తిరుమలరావు, పల్ల నారాయణరావు, జి.ఉషారాణి, బి.సంతోష్ కుమార్, ఎవిఆర్ ఎం దిలీప్ రాజా పట్నాయక్,  ముదిల శంకరరావు, బూరాడ గణేశ్వరరావు, డా.యెన్ను అప్పలనాయుడు, కలమట శ్రీరాములు, అమ్మల కామేశ్వరి, పెదకోట ధనుంజయరావు, గూనాపు శార్వాణి, కలమట గోవిందరావు, గేదెల మన్మధరావు, ఉర్జాన ప్రసాదరావులు రచించిన కవితలు ఇందులో చోటు చేసుకున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, మన మనుగడకు చెట్లు, ఓ యువకా!, బడిలో బాల్యం, మేటివంట పులిహోర, కవి(తల)లక్షణం శ్రోత(కుల)విలక్షణం, సత్యాన్ని శోధించు, నా ఊపిరి విప్లవం, తెలుగు భాష గొప్పతనం, అమ్మానాన్నలు, శ్రమజీవి, సృష్టి దీపాలు, సైనికుడు, ఆపరేషన్ సిందూర్, ఉత్తరం కన్నీరు కార్చింది వంటి సామాజిక అంశాలతో కూడిన ముప్పది కవితలు ఆద్యంతం అందరి ప్రశంసలు పొందాయి.
కామెంట్‌లు