అది ఒక పల్లెటూరు, అక్కడ ఒక బీద కుటుంబం ఉండేది. యజమాని పేరు వేమయ్య భార్య పేరు భీరమ్మ. వారికి భూమి ఉన్నా పంటలు పండక కూలికి పోతే గాని ఇల్లు గడవని పరిస్థితి ఉండేది. అందుకు వారు కనిపించిన ప్రతి పనికి వెళ్లేవారు, ఒక్కొక్కసారి మూడు పూటల తినడానికి కూడా కష్టంగా ఉండేది. రెండు పూటలే తినేవారు. పూర్వమ్ వర్షాలు సరిపడక పంటలు పండక చాలా పేదరికం అనుభవించేవారు. ఒక్కొక్కసారి భార్య బీరమ్మ పది కిలోమీటర్లు కూడా నడిచి వెళ్లి పచ్చ కలుపు నాట్లు వేసి వచ్చేది. పోయి రావడానికి వాహనాలు కూడా సరిగా ఉండేవి కావు, ఉన్నా కూడా డబ్బులు పెడితే ఎక్కడ కుటుంబ ఖర్చులు తక్కువ అవుతాయని నడిచి వచ్చేది. ఒక్కొక్కసారి పొలాల కోసం పరిగె ఏరుకోవడానికి కూడా కిలోమీటర్లకు కొలది నడిచి వెళ్లి వచ్చేది. ఈమెకు రాని పని అంటూ ఏమీ లేదు, మగవారితో సమానంగా కోతలు, పత్తి చేనుకు మందు కొట్టడo, వరాలు తీయడం, నారు పంచడం వంటి అన్ని పనులు చేసేది. ఎంత కష్టమైన పనిని కూడా చలాయించుకొని వచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత మల్ల అన్నం వండి కూరొండి నీళ్లు కాబట్టి, బట్టలు ఉతికేసి అందరికి అన్నం పెట్టేది. చివరికి తాను తినేది. ఇదే విధంగా భర్త అయినటువంటి వేమయ్య కూడా రాత్రి పగలు చలి వాన అని తేడా లేకుండా పనిచేసేవాడు. నాగార్జునసాగర్ డ్యాం కడుతుంటే నల్లగొండలో లారీలకు కంకర నింపి, మళ్లీ దాన్ని అన్లోడ్ చేస్తూ వచ్చేవాడు. ఆ రోజుల్లో ఒక లారీ నింపడానికి, మళ్లీ కాళి చేయడానికి ఐదు రూపాయలు మాత్రమే ఇచ్చేవారట. ఉదయం పెందులాడే వెళ్లి రాత్రి ఎప్పుడో వచ్చేవాడు. ఒక్కోసారి నిద్ర కూడా సరిగా ఉండేది కాదట. అలా కష్టపడ్డ వీరిద్దరికి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు కలిగారు. వీరి జననం ఒక్కొక్కరికి ఏడు సంవత్సరాల తేడా జరిగింది. కొడుకు పెద్దవాడు అందులో అతనికి చిన్నప్పుడు న్యూమోనియా రావడం వలన, దానిని తగ్గించుకోవడానికి చాలా రకాల మందులు వాడేవారు, దగ్గు బాగా వచ్చేది. తల్లి తండ్రులు ఇద్దరు బాగా బాధపడేవారు. ఎందుకంటే అప్పటికే తొలిచూలుగా పుట్టిన ఆడబిడ్డ పుట్టిన రెండు నెలలకే చనిపోయిందట. ప్రతినెల నల్లగొండ లో డాక్టర్ దగ్గరికి తీసుకొనిపోయేవారు .ఒకొక్కసారి మందులకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడేవారు. ఈ తల్లిదండ్రులిద్దరు ఆ అబ్బాయికి ఇలా ఒక ఆరు సంవత్సరాలు మందులు వాడారు. ఆ తర్వాత డాక్టరుగారి తో ఏందీ సార్ ఇది పూర్తిగా తగ్గదా అని అడిగారట, డాక్టర్ గారేమో పిల్లవాని వయసు పెరిగే కొద్ది అదే తగ్గుతుంది అన్నారు. అప్పుటినుండి వారి ప్రాణం కొంత కుదుట పడ్డా పూర్తి గా మనసు నిమ్మల పడలేదట. కుటుంబ పెద్ద అమ్మకు, కొడుకుకి జొన్న సజ్జ అన్నం పెట్టేవారుకాదు, పెట్టకుండా, వరి అన్నం పెట్టేవారు. వారు ఇద్దరు మాత్రం సజ్జ, జొన్న అన్నమే తినే వారు.కానీ ఇంటి పక్కల వారు ఆ పిల్లవాడు తగ్గుతుంటే, చాలా హేళనగా చూసేవారు. పిల్లవాడు కూడ చాలా పథ్యం చేసేవాడు. తీపివి, కొబ్బరి,తో పాటు, ఇతరులు ఏదన్న ఇచ్చినా కూడా తినేవాడు కాదు, నాకు పథ్యం అనేవాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏదైనా తినొద్దు అని చెప్తే దానిని ముట్టుకునే వాడు కూడా కాదు. అలా ఆపిల్లవాడు ఆ నిబద్దత తోనే ఎప్పుడూ ఉండేవాడట. అలాంటి పిల్లవానికి ఒక చెల్లెలు పుట్టిది. ఇతనే పెద్దవాడు కాబట్టి ఆ చెల్లెలును అమ్మానాన్నలు పనికి పోయిన తర్వాత ( నాయనమ్మ తాతయ్యలు కూడా లేరు ) బడి మానేసి కూడా చెల్లెలి దగ్గర ఉండేవాడు. స్నానం చేయించడం, జుట్టు వేయడం కూడా చేసేవాడు. అమ్మానాన్నలు వచ్చేవరకు పొయిలకు కట్టెలు, గోలెములకు నీళ్లు తెచ్చి పోసి అన్నం కూడా వండేవాడు. అతను ఏడు సంవత్సరాల నుండే అన్నం వండుతుందేవాడట. అమ్మ నాయనలు వచ్చినంక
రాత్రిపూట దీపం ముందు కూర్చొని చదువుకునేవాడు. ఒక్కొక్కసారి తల ముందు వెంట్రుకలు కాలేవట. ఊరిలో బడి ఏడవ తరగతి వరకు ఉండేది. అప్పటి వరకు మామూలు విద్యార్థిగా చదువుకున్నాడు. ఆ తర్వాత పైచదువులు చదువుకోడానికి మండలంలో ఉన్న పెద్ద బడికి వెళ్ళాడు. అక్కడ హాస్టల్లో ఉండేవాడు. వారానికి ఒకసారి ఇంటికి వచ్చేవాడు. డబ్బులు లేక హాస్టల్లో సీట్ రాకముందు రోజు బడికి 7 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్ళేవాడు.తిరిగి వచ్చేటప్పుటికి మాత్రం చార్జ్ డబ్బులు తీసుకొని మండలం నుండి చెపొస్ట్ వరకు నడిచి అక్కడనుండి తిరుపతి రావు సర్వీస్ ఎక్కి ఇంటికి వచ్చేవాడు. అప్పుడు ఆటోలు ట్రాక్టర్లు కూడా ఉండేవి కావు,అందరికి ఇసుక లారీ లు, ఈ సర్వీసే దిక్కు. కొందరికి మాత్రం సైకిళ్ళు ఉండేవి, వీళ్ళు కు లేదు తరువాత పాత సైకిల్ కొనుక్కున్నారు. అలా పదో తరగతి వరకు చదివాడు, అనుకోకుండా ఒక సబ్జెక్టు లో తప్పాడు. ఇంటి దగ్గర ఉండి వ్యవసాయ పనులైన అరకలు తోలడం, పత్తి గింజలు పెట్టడం, కలుపు తీయడం, ఎడ్ల బండి కట్టుకొని పత్తి కి మందుకొట్టి రావడం చేస్తూ తల్లి దండ్రులకు తోడుండేవాడు. ఉదయం పూట పశువులకు పచ్చి మేత తేవడం కూడ చేసేవాడు. ఇవన్నీ చేసినా అతనికి బాధనిపియ్యలే కానీ, ఇతనితో పాటు చదువుకున్న వాళ్ళు పండగలకు వచ్చినప్పుడు, వారి ముందు తిరగాలంటే అతనికి చాలా బాధనిపించేది. అప్పుడు ఇతనికి నేను కూడా బాగా చదువుకోవాలి, వాళ్లలాగా కాలేజీకి వెళ్లాలనిపించింది. ఇది ఇలా రెండు సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత అతను పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చేరి రెండు సంవత్సరాలు ఇష్టంతో కష్టపడి చదివి ద్వితీయ స్థానంలో పాస్ అయ్యాడు. ఆ తర్వాత డిగ్రీ, టీచర్ ట్రైనింగ్, 2000 లో పీజీ, నెట్టు, ఎక్కడ కూడా ఆగకుండా అన్నింట్లో మొదటి స్థానంలో పాస్ అయ్యాడు. పీజీ చేస్తుండగానే విద్యా వాలంటీర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసాడు, అప్లై చేయడానికి ఊరికి వెళ్ళాడు, దీనికోసం వలన ఒక మనిషిని ఇచ్చి కూడా పంపించాడు హైదరాబాదుకు. ఊరికి పోయిన తర్వాత వాళ్లతో పాటు చదువుకునే అబ్బాయి వాళ్ళ నాన్న నీవు ఈ వాలంటీర్ ఉద్యోగం చేస్తే నీకు భవిష్యత్తు ఉండదని చెప్పాడు. ఆ పెద్దమనిషి మాటతోనే వెంటనే అతను మళ్ళీ హైదరాబాదుకు వెళ్ళాడు. కొన్ని రోజులు ఉపాధ్యాయ ఉద్యోగం కోసం హైదరాబాదులో వెతికాడు, కానీ కొన్ని కారణాలవల్ల అక్కడ పని చేయలేదు. ( ఇస్తాము గాని ఒరిజినల్ సర్టిఫికెట్ పెట్టమన్నారు )ఆ తర్వాత 1999 లో డీఎస్సీ నోటిఫికేషన్ పడితే అప్లై చేయడానికి ఊరికి వెళితే తెల్లారే ఆ నోటిఫికేషన్ రద్దయింది. తర్వాత 2000 సంవత్సరం డీఎస్సీకి అప్లై చేసి రాశాడు హైదరాబాదులో, కానీ అక్కడ నాన్న లోకల్ కావడం వలన ఉద్యోగం రాలేదు. మరల 2001 లో డీఎస్సీకి అప్లై చేసాడు, అనుకోకుండా ఒక రోజు ఉస్మానియా క్యాంపస్ లో ఉండగా ప్రాజెక్ట్ అయిన ఫారం వచ్చింది. అంటే నా అతనికి చాలా పెద్ద భయమైంది. నా డీఎస్సీ అప్లికేషన్ రద్దయిందని అనుకుని చాలా బాధపడ్డాడు. తీరా చూస్తే అది డిఎస్ అప్లికేషన్ ఫామ్ కాదు. ఎందుకు భయపడ్డాడు అంటే ఆరోజు అటెస్టేషన్ కోసం ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్తో సంతకం చేశాడు కాబట్టి. ఆ తర్వాత అతను ఒంటరిగా ఎటువంటి కోచింగ్ లేకుండా చదివి డీఎస్సీ రాసి, వెంటనే APSWRS లో PGT తెలుగు బోధించడానికి చేరి, 4 నెలలు చేసాడు. కానీ ఇతను ఇంతవరకు ఎటువంటి కోచింగ్ లేకుండా బిఈడి డీఎస్సీ సాధించాడట. ఇక్కడ రెండు మంచి అనుభవాలు జరిగినాయి. ఒకటి ఒక రోజు ఇంటి నుంచి నారాయణఖేడ్ దగ్గర నల్లవాగు వెళ్లడానికి బయలుదేరి నారాయణఖేడ్ వెళ్లగానే అక్కడ బస్సు వెళ్ళిపోయింది. ఆరోజు అక్కడనే పడుకొని (లాడ్జి లో ), తెల్లవారుజామున బస్సు ఎక్కి నల్ల వాగు చేరుకున్నాడు,( పనిచేసే పాఠశాల ఊరు ) రెండవది మరోసారి కూడ ఇలానే బయలుదేరగా ఆరోజు సిర్గాపూర్ వెళ్లే బస్సు దొరికింది. సిర్గాపూర్ లో దిగాడు. అక్కడనుండి నల్లవాగు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు. 9:00 రాత్రి కొత్త స్థలం, ఒక్కడినే నడుచుకుంటూ వెళ్తుంటే ఒక్క మనిషి లేడు, ఎప్పుడో ఒక్కటి బైక్ వచ్చేది. అలా నడుచుకుంటూ నల్లవాగు రాత్రి చేరుకున్నాను. తెల్లారి మా పాఠశాల పిల్లలు ఎప్పుడు ఎలా వచారని అడిగిగారు జరిగిన విషయం చెప్పాను. ఏమన్నారంటే రాత్రి వేళ లో అడవి జంతువులు ఉంటాయి సర్ అమ్మో ఎట్లొచ్చారు సార్, భయం వేయలేదా అన్నారు.ఇది r ఒక కొత్త అనుభవం. ఇలాంటివి అతని చిన్నప్పుడు కొన్ని జరిగినవి. చదువుకునేటప్పుడు రాత్రిలో బస్సు దిగి ఒంటరిగా రెండు కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లేవాడు. ఆ తర్వాత డిఎస్సి రిజల్ట్ రానే వచ్చింది. తనతో పని చేసే పిజిటి ఇంటికి వెళ్లగా అతనికి ఫోన్ చేసి తన డీఎస్సీ రిజల్ట్ చూడమన్నాడట, అతను చూసి వెంటనే డీఎస్సీ లో జాబ్ వచ్చిందని చెప్పాడు. జాబ్ వస్తదో రాదో అనుకున్న తనకి ఉద్యోగం రాగానే అంతులేని సంతోషం కలిగింది. తల్లి తండ్రికి తెలియగానే కొడుకు కి టీచర్ ఉద్యోగం వచ్చిందని పట్టారాని సంతోష కలిగింది. తమ కష్టం ఫలిoచిందని చాలా ఆనందపడ్డారు.తనకు చదువు రాకపోయినా చదువుకు సంబంధించిన విషయాలను తమ ఊర్లో ఉన్నటువంటి స్నేహితుల ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని వచ్చి తన కొడుకుతో చెప్పేవాడు. పిల్లల కోసం నిరంతరం సరిపోను భూమి లేకపోయినా కౌలు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. కానీ ఒక విషయం అలా రాదానుకొనేనేమో అతని కొడుకు తప్పు పడిన పుట్టిన తేదీని మార్చుకునే అవకాశం వేరే మార్గం లో ఉన్నది అని అతనికి ఇంటర్ లో బోధించిన గురువు గారి నాన్న ఒక న్యాయవాది సలహా ఇస్తాడు, ఈ అనుమానం తో మార్చుకోలేదు.ఆ తర్వాత ఏప్రిల్ 2న కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి , జాయినింగ్ ఆర్డర్ కాఫీ తీసుకొని, ఏప్రిల్ 4వ తేదీ న మొదటి ఉద్యోగంలో చేరాడు. ఇప్పటివరకు అతను చేసిన నాలు చాలా నిక్కచ్చిగా పద్ధతి ప్రకారం ఉద్యోగం చేస్తుండట. ఎప్పటికైనా వాళ్ళ అమ్మ నాన్న ఆలోచనే ఉండేది అతనికి. దూరం చుట్టం అయిన టీచర్ ఉద్యోగస్తురాలితో వివాహం అయినది.ఈమె భర్త అడుగుజాడల్లో నడిచేది. అతనికి ఒక పాప ఒక బాబు.అతను ఉద్యోగరీత్యా నీలగిరి లో ఉండేవారు. దురదృష్టమో ఏమో కానీ 2012 కుటుంబ యజమాని అయినటువంటి వాళ్ళ నాన్న ప్రమాదవశాత్తు చనిపోయాడు. కుమారుడు దిగమింగుకోలేని దుఃఖంలో మునిగిపోయాడు. తనను ఎంతో కష్టపడి, ప్రేమించి పెద్ద చేసిన తండ్రి మరణాన్ని అతను తట్టుకోలేకపోయాడు. యజమాని పెద్ద కూతురు ఒక్కదాన్నే మూడు వరకూ చదివించి, తనకు తోడుగా వ్యవసాయంలో పెట్టుకున్నాడు. తరువాత ఆమెకు పెళ్లి చేశాడు, ఆమెకు ముగ్గురు కూతుర్లు, ఇప్పుడు పెద్దామె డిగ్రీ, తర్వాత ఆమె PGB Ed, చిన్నామే B tech, వాళ్లను ఉన్నన్నిరోజులు చాలా అల్లారి ముద్దుగ చూసుకునేవాడు యజమాని.రెండో కూతుర్ని బీఈడీ వరకు చదివించాడు.తరవాత ఆమె PG కూడ చేసింది. చిన్న బిడ్డకు పెళ్ళి కాలేదు. తండ్రి చనిపోయిన దగ్గర నుంచి కొడుకు ఒకటే ఆలోచించేవాడు తన అమ్మని చెల్లెళ్ళ ను తన నాన్న లాగే చూసుకోవాలి అనుకున్నాడు, అలానే రెండో చెల్లెలికి ఉద్యోగం చేసే అబ్బాయితో ఘనంగా పెళ్లి జరిపించాడు.వారిది కూడ నీలగిరే. బిడ్డ కి ఎటువంటి లోటు రానివ్వలేదు. ఆ బిడ్డ కి ఇద్దరు కొడుకులు, వారి బారసాలలు కూడా చాలా బాగా జరిపించాడు. కొడుకు చిన్న కూతురు ఇద్దరు నీలగిరి లోనే ఉంటున్నారు. పెద్ద బిడ్డ బిడ్డకి పెళ్ళి చేశారు, అత్తవారి నుండి పొరపాచాలు వచ్చాయి. వారిదే కొంత వెలితిగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటివరకు చిన్న పెద్ద చెల్లెళ్ళను కొడుకు అతని భార్య చాలా బాగా అందరిని మంచిగ చూసుకుంటున్నారు. ఇప్పటికి అందరు సంతోషంగానే ఉన్నారు. యజమాని కొడుకుది అందరిని మంచిగా చూడాలనే మనస్తత్వం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి