చంద్రమా మానసో జాత:..!!:- డా.మరుదాడు అహల్యా దేవి-బెంగుళూరు
 సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు 
===============
శశాంకుడు,చంద్రుడు, నెలవంక అనే పేర్లతో పిలవబడుతూ..
నిత్యం మనలను అలరిస్తూ,తుంటరిగా వేధిస్తూ..
తారకల మధ్య మరింత అందాలొలుకుతూ ,కొంటెగా నవ్వుతూ..
కొత్త దంపతులపై మత్తును జల్లుతూ, మోహాన్ని రేపుతూ..
పౌర్ణమి అమావాస్యలలో తన కళలతో పెరుగుతూ,తరుగుతూ..
జీవితం ఇంతే సుమా,ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు. 
రేపు ఏమౌతుందో తెలియక ఊరేగుతుంటాం మనం ఆశల పల్లకీపై అనే సత్యాన్ని చెపుతూ..
చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే,కష్టం కలకాలం ఉండదు..
ఆశావహ దృక్పథంతో బ్రతకమన్న జీవన సూత్రాన్ని చెప్పే చందమామ..
చందమామ వీడ్కోలు పలికాక, సూరీడు ఆశీస్సులతో లోకాలను 
వెలుగుతో నింపు సన్నివేశం..
ఎంతటి అద్భుతమో కదా ఈ జీవన వేదం..
చీకటి వెలుగుల రంగేలీ
జీవితమే ఒక దీపావళి అన్నాడొక సినీకవి..
జీవితాన్ని దీపావళితో పోలిక ఎంత సమంజసమో కదా..
చంద్రమా మానసో జాత: అని వేదంలోని పురుషసూక్త వాక్యం..
చంద్రుడు మనస్సుకు కారకుడని చెప్తుంది జ్యోతిష్యం..
అందుకే గోచారంలో చంద్రుని ప్రభావం అధికం జాతకులపై..
చల్లని వెన్నెలలు కురిపించే చంద్రయ్య జీవితాలపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు.
చంద్రుడు శ్వేతవర్ణానికి ప్రతీకగా, స్త్రీ జాతికి చిహ్నంగా చెప్తుంది శాస్త్రం..
ఎగుడు దిగుళ్ళు ఎన్నున్నా, అన్నిటినీ సమానంగా స్వీకరిస్తూ..
తామరాకుపై నీటిబొట్టులా జీవించమన్న సందేశాన్ని ఇస్తాడు సుధాకారుడు. !!


కామెంట్‌లు