సైబీరియన్ టైగా- యామిజాల జగదీశ్
 1978లో, సైబీరియన్ టైగా (టైగా అనేది ఒక బయోమ్). ఇది ఉత్తర అమెరికా, యూరప్ ఆసియాలోని పెద్ద ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది శంఖాకార అడవులతో కూడిన ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ. టైగాలో, చలికాలం చాలా పొడవుగా, చల్లగా ఉంటుంది, అయితే వేసవి కాలం స్వల్పమై వెచ్చగా ఉంటుంది. ఈ అడవిలో ఎత్తైన చెట్లు, తక్కువ ఎత్తులో పెరిగే పొదలు, వివిధ రకాల జంతువులు, మొక్కలు కనిపిస్తాయి.) మీదుగా ప్రయాణిస్తున్న సోవియట్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందం అక్కడ ఉండకూడనిది కనిపించింది. అది ఓ మారుమూల పర్వత ప్రాంతంలోని ఒక చిన్న తోట.
అదేమిటో 
పరిశోధించడానికని దిగినప్పుడు, వారు ఒక గుడిసెలో ఆరుగురు లైకోవ్స్ కుటుంబాన్ని కనుగొన్నారు. వారు 40 సంవత్సరాలకు పైగా ప్రపంచంలోని ఇతరులతో ఎలాంటి సంబంధమూ లేకుండా జీవిస్తున్నారు.
కుటుంబ పెద్ద కార్ప్ లైకోవ్, తన భార్య అకులినా, వారి ఇద్దరు పిల్లలతో 1936లో పారిపోయారు. రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి సాంప్రదాయ శాఖ అయిన "ఓల్డ్ బిలీవర్స్‌"గా, వారు నాస్తిక సోవియట్ పాలనలో మతపరమైన హింస నుండి తప్పించుకునే క్రమంలో ఈ ప్రాంతానికి చేరుకున్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
నాలుగు దశాబ్దాలుగా, వారు అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా జీవించారు. వారు తమ సొంత ఆశ్రయాన్ని నిర్మించుకున్నారు. జనపనారతో బట్టలు తయారు చేశారు. చెట్ల బెరడు నుండి బూట్లు తయారు చేశారు. వారు వేటాడి జీవించారు.
వీరికే మరో ఇద్దరు పిల్లలు ఈ అరణ్యంలోనే పుట్టారు. పిల్లలలో ఎవరూ తమ కుటుంబం వెలుపల మరొక మానవుడిని చూడలేదు. వారికి రెండవ ప్రపంచ యుద్ధం, చంద్రునిపై అడుగుపెట్టడం లేదా ప్లాస్టిక్ గురించి కానీ ఏమీ  తెలియదు. 
తల్లే వారికి గురువు. ఆమె బైబిల్ లోని విషయాలు చెప్తుండేది. పిల్లలకు ఇంతకన్నా మరేమీ తెలీదు.
అయితే శాస్త్రవేత్తల సాయంతో వారికి
బయటి ప్రపంచం పరిచయమైంది. కానీ వారి రాక ఆ కుటుంబానికి రోగనిరోధక శక్తి లేని వ్యాధులను కూడా పరిచయం చేసింది.
1961లో కఠినమైన శీతాకాలంలో అకులినా ఆకలితో మరణించింది.  1981లో, వారి ముగ్గురు పిల్లలు కూడా అనారోగ్యంతో మరణించారు. తండ్రి కార్ప్ 1988లో మరణించారు.
ఇక చిన్న కుమార్తె అగఫియా లైకోవా మాత్రమే మిగిలి ఉంది. నాగరిక సమాజంలో కలిసిమెలిసి బతకడానికి అవకాశాలు ఉన్నప్పటికీ, ఆమె తన కుటుంబం నిర్మించిన ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది 
అగఫియా నేటికీ సైబీరియన్ అడవులలోనే నివసిస్తోంది. ఇది ఆమె కుటుంబం విశ్వాసం, మనుగడ యొక్క అద్భుతమైన కథకు నిదర్శనంగా భావిస్తున్నారు.

కామెంట్‌లు