ప్రపంచాన్ని మార్చిన ప్రసిద్ధ "వైఫల్యాలు"! :- - యామిజాల జగదీశ్
 థామస్ ఎడిసన్ కేవలం నాలుగు నెలలకే పాఠశాల నుండి బహిష్కరించారు. మాష్టారు ఆయనను ఓ మానసిక వికలాంగుడిగా ముద్ర వేశారు. అటువంటి ఎడిసనచ చరిత్రలో గొప్ప ఆవిష్కర్తలలో ఒకరయ్యారు. 
చార్లెస్ డార్విన్ వైద్యాన్ని విడిచిపెట్టమని ఒత్తిడి చేశారు. తండ్రైతే ఓమారు ఇలా అన్నారు: "నీ ఊహలు తప్ప మరేమీ పట్టించుకోవు. ఇలాగే ఉంటే దేనికి పనికిరావు!" అని. అయితే డార్విన్ చివరికి తన పరిణామ సిద్ధాంతంతో జీవశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
"సృజనాత్మకత లేకపోవడం" కారణంగా వాల్ట్ డిస్నీని వార్తాపత్రిక ఉద్యోగం నుండి తొలగించారు. ఆ తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా ఇష్టపడే వినోద సామ్రాజ్యాన్ని నిర్మించారు.
బితోవాన్ సంగీత ఉపాధ్యాయుడు. అతన్ని అత్యంత ప్రతిభావంతుడని పిలిచాడు. అతను ప్రపంచంలోని అత్యంత కాలాతీత కళాఖండాలలో కొన్నింటిని కంపోజ్ చేయడం విశేషం.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ నాలుగు సంవత్సరాల వయస్సు వరకు మాట్లాడలేదు. అతని గురువు మానసిక వికలాంగుడిగా ముద్ర వేశాడు. కానీ అతను చరిత్రలో గొప్ప శాస్త్రీయ మేధావులలో ఒకడుగా ఎదిగారు.
ఆర్ట్ స్కూల్ ప్రవేశ పరీక్షలో మూడుసార్లు విఫలమైన తర్వాత అగస్టే రోడిన్ తండ్రి అతన్ని "మూర్ఖుడు"గా ప్రకటించాడు. కానీ ఆ తర్వాత అతను గొప్ప శిల్పులలో ఒకరిగా చరిత్రపుటల్లో ఎక్కారు.
దిమిత్రి మెండలీవ్ కెమిస్ట్రీలో సగటు మార్కులే సాధించాడు. అప్పుడందరూ అతనిని విమర్శించారు.  అయితేనేం, అతను ఆ తరువాత ఆవర్తన పట్టికను రూపొందించాడు. ఇది శాస్త్రాన్ని ప్రాథమికంగా మార్చి వేసింది.
ఆటోమొబైల్సు రంగంలో తిరుగులేని సృష్టికర్త హెన్రీ ఫోర్డ్. ప్రాథమిక విద్యా స్థాయిలో అనుక్షణం మాటలు పడ్డ ఫోర్డ్ గొప్ప విజయాన్ని సాధించడానికి ముందు అనేకసార్లు ఎందుకూ పనికిరావనే మాటలు మూటగట్టుకున్నారు.
మార్కోని రేడియోను కనిపెట్టి, గాలి  ద్వారా పదాలను ప్రసారం చేయడాన్ని వివరించినప్పుడు, అతని స్నేహితులు అతన్ని మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతను తన మతిస్థిమితం కోల్పోయాడని భావించారు. నెలల తర్వాత, అతని ఆవిష్కరణ లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడింది.
ఇటువంటి కొన్ని విషయాలు తరచి చూడగా నేర్చుకునే పాఠం : ఇతరుల తీర్పులు మీ సామర్థ్యాన్ని నిర్వచించనివ్వకూడదు. గొప్పతనం తరచుగా ఎదురుదెబ్బలతో మొదలవుతుంది. మిమ్మల్ని మీరు నమ్మాలి! 

కామెంట్‌లు