తొలిసంధ్యలో శిఖరవేదిక పైన
తెలి వెలుగుల కనకవీణ కచేరీ లో
వెల్లువయే చైతన్య రాగాలాపనకు
చిత్రంగా చిత్తరువైన ప్రకృతి!
బంగారు కిరణాలు సోకిన
హిమగిరులు తామే
హిరణ్యమయములై
కనకధార! కనువిందు చేసె!
జాలువారు సెలయేరు
జలతరంగపు సవ్వడిలో
గాలి వేయు ఈలలన్ని
వాయులీనమై కలిసిపోయె!
తరలివచ్చు దినకరుని చూసి
తలయూచు తరువులు
తనవంతుగా సహకరించి
తంబుర శృతిలా సంగమించే!
ఇరుగట్లు ఒరుస్తూ సాగిపోతూ
మృదువుగా తీరాలను చరుస్తూ
తగురీతిగా స్పందించు ఏరు
మృదంగ వాద్యమై మురిసే!
సుందర విశ్వ వేదిక పై
సత్యముగా కనిపించు
శుభకరమైన ఈ దృశ్యము
శివమైన తత్వ ఆవిష్కరణగా తోచె!
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి