అవనీ!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
ధనానికి దాసోహం అయినట్లు 
నీకోసం ధ్యానం చేస్తూనే ఉన్నా! 

చదువును ఏకాగ్రతతో నేర్చుకుంటున్నట్లు 
నిన్ను మనస్ఫూర్తిగా ఓర్చుకుంటూనే ఉన్నా!!

కీర్తి కోసం పరితపించినట్లు 
నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా!!

అధికారం కోసం ఆలోచించినట్లు 
నీకోసం పగలు రాత్రి మేల్కొంటూనే ఉన్నా!!

గాలి వెంటపడిన 
మేఘంలా వర్షిస్తూనే ఉన్నా!!

విత్తనం లా మట్టిలో విసిరివేయబడ్డ 
మౌనంగా మొలకెత్తుతూనే ఉన్న!!

ఒంటరిగా నడుస్తూ ఉన్నా
భూమిలా నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నా!!

అమ్మ తర్వాత అక్క- అక్క తర్వాత చెల్లి- చెల్లి తర్వాత స్నేహితురాలు -స్నేహితురాలు తర్వాత ప్రేయసి- ప్రేయసి తర్వాత భార్య 
వరుసలేన్నైనా- ఎన్ని అవతారాలు ఎత్తిన 
అవన్నీ నీవే- అవని నీవే కదా!!!

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు