జీవితం:- జంజం కోదండ రామయ్య-జమ్మిపాళెం
సాహితీ కవి కళాపీటం
సాహితీ కెరటాలు
=================
నిండు పున్నమి చందమామ
ఆనందాల వెలుగులను కురిపించి
అందరికీ ఆనందాన్ని పంచు..!

మళ్ళీ కష్టాల అమావాస
నేనున్నానంటూ వస్తుంది..!!

కష్టాలను సుఖాలను
సమంగా చూసుకున్న
జీవితమే సార్ధకమౌతుంది..!

అలాగాక
ప్రక్కవారు సుఖంగా ఉన్నారని
తలచి.వగచి వగచి
మనశ్శాంతి కోల్పోయి
నీ సుఖాలను పాడుచేసుకోకు..!!!

జీవితమంటే
కలసి వుంటాయి
వెన్నెల చీకటి
తెలుసుకున్న కష్టాలు ఏపాటి...!!!


కామెంట్‌లు