ఓ అమ్మాయిల్లారా.!
ఓ అబ్బాయిల్లారా..!
ఓ అమాయక ప్రేమికుల్లారా…
పిచ్చిప్రేమను పూలమాలగా ధరించి
పార్కుల్లో విహరించే ఓ ప్రేమపక్షుల్లారా..!
జతగా మారే జంటలకు
స్వేచ్ఛ ఒక వరం కావొచ్చు…
ఒక ప్రేమ పల్లకీ కావచ్చు…కాని అది
కలకాలం...మాయనిమచ్చ కారాదు..!
పకపక నవ్వులతో పచ్చనిపొదల మధ్య
ప్రేమగా తిరగడంలో తప్పేమీ లేదు…
కాని…సాయంత్రపు చిమ్మ చీకటిలో
సిగ్గులజ్జాలేని ఆ ముద్దు ముచ్చట్లే...
మైకంలో ఏదో మత్తులో మునిగిపోయి
చేసే ఆ చిన్న తప్పు రేపు ఆరని నిప్పు..!
ఆ తప్పు అందరిలో
పెళ్లిపందిరిలో మెడలో తాళైతే మేలే...
కాని...కోరికలు తీరగానే…
తీరం దాటి తెప్పను తగలేస్తే...
ఖర్మ కాలి కాలుజారి కడుపు పండితే...
తల్లిదండ్రుల కెన్ని తలవంపులు...?
అందుకే…
పార్కుల్లో స్వేచ్ఛగా తిరిగే
ఓ అమాయక అమ్మాయిల్లారా..!
ఓ ప్రేమపక్షుల్లారా..!
గులాబీలు పట్టుకున్న గుంటనక్కలు…
మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి..!
ఇకనైనా ఈ కంప్యూటర్ యుగంలోనైనా
కళ్ళుతెరిచి ఈ రంగులలోకాన్ని చూడండి!
ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..!
సెల్లు దూరం పెట్టుకోండి ..!
కల్తీ ప్రేమకు చెక్ పెట్టండి..!
స్వచ్ఛమైన ప్రేమకు హారతి పట్టండి..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి