సాహితీ కళాపీఠం,సాహితీ కెరటాలు,=================ఒడిదుడుకుల ప్రయాణం,ఎన్నో ఆశలు ఆశయాలు,కంటి నిండా _దుఃఖం,అప్పుడే నవ్వుల పువ్వులు!ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో గాయాలు,దాచుకున్న బాల్యపు స్మృతులు,నిండైన ప్రేమలు పంచుకునే బంధాలు,బాధ వస్తే ఓదార్చే కుటుంబ సభ్యులు!సమస్యలు _సమాధానాలు,ఓటమి గెలుపుల ఒరవడులు,అనుకున్నది జరుగుతుంది అనిజరగక బాధతో కృంగిపోవడం,జీవితం ఏమిచ్చినా స్వీకరించడమే!అప్పుడే వెలుగు పంచుతుంది,చిమ్మ చీకట్లోకి నెడుతుంది,ముందు చూసుకుంటే అందరూ ఉన్నట్లేకానీ ఎవరు నీతో లేరు ఉండరు,నీ జీవితంలో నిజాన్ని గ్రహించడమే!చందమామలా వెలుగు పంచుతూచీకట్లోకి తోసి వెలుగులో బ్రతుకుతున్నట్లే జీవితం,అనుకోని సాగిపోవడమేఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఓర్పు సహనంతోజీవితాన్ని చందమామ వెలుగుల తొంగి చూడడామే!
జీవితం:- నారి నరేష్ మస్కట్ ఒమన్,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి