చిన్నారులు-చిరు దివ్వెలు:- --గద్వాల సోమన్న, 9966414580
పసి పిల్లల ముఖములు
రవిచంద్రుల వెలుగులు
వెన్నెల వన్నెల్లా
విరజిమ్మును సొగసులు

చిన్నారుల పలుకులు
జుంటితేనె ధారలు
అలతి అలతి పదములు
దోచుకొనును మనసులు

శుద్ధమైన తలపులు
భగవంతుని రూపులు
ముద్దులొలుకు పిల్లలు
ముద్దబంతి పూవులు

భారతమ్మ పుత్రులు
ప్రేమిస్తే మిత్రులు
అందరికీ ఇష్టులు
గుణంలోన శ్రేష్టులు

వెలుగులీను దివ్వెలు
విహరించే గువ్వలు
పూలలాంటి బాలలు
పరిమళించు మాలలు

మింటిలోన తారలు
ఇంటిలోన పిల్లలు
బహు అందము నవ్వులు
స్వచ్ఛమైన ప్రేమలు


కామెంట్‌లు