బాల్యం:- పైడి రాజ్యలక్ష్మి
  జీవనానికి వెలుగు దీపం
 పిల్లలే జీవన పల్లకీలు 
 తల్లి తండ్రుల ప్రేమతో తడిసిన పూబాలలు,
వారే పెద్ద కలలు ॥ 
పిల్లలే మనశ్శాంతికి ముడి రాగాలు 
 వాళ్ల కళ్ళల్లో కనిపించే నమ్మకం 
 మనసుకు తాకే మౌనసంగీతం 
 వారే మమతల అనురాగం ॥
దిగులు పట్టిన మనస్సుకు 
 వారి జ్ఞాపకాలే నవ చైతన్యo 
వారే కనిపించే స్వప్న తారకలు 
 ఆశలలో మెరిసే ఇంద్రధనస్సులు ॥ 
వారి నవ్వుల్లో కొత్త భవిష్యత్తు 
 వారి అడుగుల్లో ఆశల జలపాతం 
 వారి చేతుల్లో విద్యాధనం 
 వారు తయారు చేసే స్వర్ణ జీవనం ॥

కామెంట్‌లు