పూలతోటలో, సీతాకోకచిలుక మకరందం కోసం పూవుల మీద వాలింది. దాని రంగుల రెక్కలను చూసి పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టారు. అదే సమయంలో, పక్కనే ఉన్న మురికి చెత్తకుప్ప మీద వాలిన ఒక ఈగను చూసి పిల్లలు అసహ్యించుకుని,
"ఛీ, పో!" అంటూ తరిమేశారు.
పిల్లల ఆదరణను చూసిన ఈగకు సీతాకోకచిలుకపై ఎంతో అసూయ కలిగింది.
"నాకెందుకు ఈ ఆదరణ లేదు? దీన్ని ఇక్కడ ఉండనివ్వను!" అనుకుంటూ కోపంతో సీతాకోకచిలుక దగ్గరకు వెళ్లి,
"ఓసీ అహంకారీ! నిన్ను ఈ తోట నుంచి తరిమేస్తాను!" అంటూ కటువుగా దూషించింది.
సీతాకోకచిలుక ఈగ మాటలను పట్టించుకోలేదు. దాంతో ఈగ కోపం పెంచుకుని, సీతాకోకచిలుక వాలిన పూల మీదనే పదేపదే వాలడం మొదలుపెట్టింది. ఈగను తరిమే క్రమంలో, పిల్లలతో పాటు సీతాకోకచిలుక కూడా పూల మీద నుంచి లేచిపోవాల్సి వచ్చింది.
ఈగ విసిగిస్తున్నందుకు సీతాకోకచిలుకకు చిరాకు కలిగింది. దాన్ని వదిలించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించింది.
"మిత్రమా ఈగా! నీవు ఈ పూల మకరందం పీల్చలేవు. నీకు ఇష్టమైన తియ్యటి ఆహారం నా దగ్గర బోలెడు ఉంది. నాపై అసూయపడటం మానేసి, నాతో స్నేహం చెయ్యి. నా వెంట వస్తే నీకు నచ్చిన ఆహారం చూపిస్తాను" అని ప్రేమగా పిలిచింది.
ఈగ సీతాకోకచిలుక మాటలు నమ్మి, దాని వెంట వెళ్ళింది. ఇంటికి చేరుకోగానే, సీతాకోకచిలుక ఒక పెద్ద బెల్లం ముక్కను తెచ్చి ఈగ ముందు ఉంచింది. తియ్యటి వాసనకు ఈగకు నోరూరింది, ఆశగా బెల్లం మీద వాలి కడుపునిండా తినేసింది. తిన్న తర్వాత ఎగరాలని ప్రయత్నించింది కానీ, దాని రెక్కలు బెల్లానికి అతుక్కుపోయాయి. ఎంత ప్రయత్నించినా ఎగరలేక అటూఇటూ గింజుకుని నీరసించిపోయింది. సీతాకోకచిలుక ముసిముసి నవ్వులు నవ్వి,
"తియ్యటి రుచిపై నీకున్న ఆశే ఈరోజు నిన్నిలా చేసింది. అకారణంగా నాపై అసూయపడి, నన్ను విసిగించినందుకు నీకిదే తగిన శాస్తి!"
అని చెప్పి, హాయిగా పూలతోటలోకి ఎగిరిపోయింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి