గిడుగు మనకు ..గొడుగు ....:-ప్రముఖ కవి కోటం చంద్రశేఖర్
 

 మొలక , కవిత్రి మొల్ల కళావేదిక  ఆధ్వర్యంలో  తాండూరు లోజయంతి వేడుకలు 
వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ నెంబరు 2 పాఠశాలలో 
గిడుగు రామ్మూర్తి జయంతి హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని పాఠశాలలో ఘనంగా తెలుగు భాష క్రీడా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి కోటం చంద్రశేఖర్ వికారాబాద్ జిల్లా జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ చారి కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు  KVM వెంకట్
పాల్గొని  ధ్యాన్,చంద్ గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు 
ఈ కార్యక్రమంలో 
ప్రముఖ కవి కోటం చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ 
విద్యార్థులు మొలకదశలోని 
అమ్మ భాష పై మమకారం పెంచుకొని 
క్రీడల్లో రాణించాలని 
ఆయన పేర్కొన్నారు 
ఈ కార్యక్రమంలో
సీనియర్ జర్నలిస్టు వికారాబాద్ జిల్లా   జర్నలిస్టు సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ చారి పాల్గొని మాట్లాడుతూ 
అన్ని భాషలు ఎన్ని నేర్చుకున్న అమ్మ భాష మర్చిపోరాదని 
ప్రభుత్వ పాఠశాలలో 
చదివే విద్యార్థులు సత్తగల విద్యార్థులని 
వారి ప్రతి  ప్రతిభ ను 
ఉపాధ్యాయులు వెలికి తీసి సమాజానికి అందించాలన్నారు
ఈ కార్యక్రమంలో 
కబయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు, మొలక ప్రతినిధి 
KVM వెంకట్ 
పాల్గొని మాట్లాడుతూ 
మొలక పుస్తకం 
విద్యార్థులకు బాల్య దిశలో 


సాహిత్యపు 
బాటలు వేసి మొక్క 
అని తెలిపారు 
మొలకని చదివి నైతిక విలువలు 
దేశభక్తి దైవభక్తి పెంపొందించుకోవాలని 
విద్యార్థులు ఎదగడానికి సమాజాన్ని ఉపయోగించుకోవాలి ఎదిగిన తర్వాత సమాజానికి మీరు కావాలి 
మీకోసం ప్రపంచం ఎదురు చూడాలని అన్నారు 
ఈ కార్యక్రమంలో తెలుగు వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు 
కార్యక్రమంలో విద్యార్థుల యొక్క 
పొడుపు కథలు 
పద్యాలు 
తెలుగు భాష డ్యాన్సులు
అలరించాయి 
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభాభారతి, మనోహర్ 
  ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు