సునంద భాష్యం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -968
యోవై చిత్తేన దూరస్థః సమీపస్థో హి దూరతః న్యాయము
*****
యో అనగా ఎవరు లేదా ఏ .వై అనగా ఖచ్చితంగా, నిజంగా,ఎందుకంటే.చిత్తేన అనగా  నేను స్పృహను,నేను స్వచ్ఛమైన చైతన్యాన్ని అని అర్థము.దూరస్థ అనగా  దూరముగా ఉన్నది.సమీపస్థోః అనగా దగ్గరలో. హి అనగా కోసం, ఎందుకంటే. దూరతః  అనగా దూరంగా, దూరము నుండి అనే అర్థాలు ఉన్నాయి.
మనసు దూరమైతే దగ్గరగా ఉన్న వాడు కూడా దూరముగా ఉన్నట్లే కనబడుతాడు.అనగా   మనసుకు దూరమైన  మనిషి మనిషిగా ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ  పైకి చూడటానికి దగ్గరగా కనిపిస్తాడేమో కానీ హృదయానికి మాత్రం ఎన్నో ఆమడల దూరంగా ఉన్నట్లే .'ఆనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు తరచూ ఉదాహరణగా చెబుతుంటారు.
 అలా మనిషి దగ్గరగా ఉన్నప్పటికీ ఇరువురి వ్యక్తుల మధ్య దూరం ఎందుకు ఏర్పడుతుందంటే  అవగాహన లోపం అయినా కావాలి.ఆధిపత్య ధోరణి అయినా కావాలి. మనసు గాయపడటం అయినా కావాలి.. ఈ మూడింటిలో వయసు మీద పడుతుంటే అవగాహన లోపం వల్ల  మాట్లాడే తీరు చిరాకు తెప్పిస్తుంది.ఆ మనిషి నుండి తానే దూరంగా ఉండాలనో లేదా తనని దూరంగా ఉంచాలనో భావన మొదలవుతుంది.
ఇక రెండవది ఆధిపత్యం. ఈ ఆధిపత్యం అంటే సాటి వ్యక్తి,తోటి వ్యక్తి మీద అజమాయిషీ,అధికారం ప్రదర్శించడం. వారిని పని మనిషి గానో,బానిసగానో చూడడం. ఇలా చేయడం వల్ల ఎదుటి లేదా సాటి/తోటి వ్యక్తి యొక్క మనసు గెలుచుకోలేడు. ఆ విధంగా వారు ఎంత దగ్గరగా ఉన్నా  వారి మధ్యలో అగాధమంత దూరం పెరుగుతుంది.
ఇక చివరిది చాలా ముఖ్యమైనది ఇది తనకు జీవిత భాగస్వామికి మధ్య గానీ, స్నేహితులు బంధువులు, అన్నదమ్ముల మధ్య ఏర్పడే దూరం. ఇది ఏర్పడడానికి కారణం మాటే. మాట చేసే గాయం మామూలుగా ఉండదు.
అందుకే   ప్రజాకవి వేమన ఏమంటారంటే " "ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు/ కాచి యతుక వచ్చు క్రమము గాను/మనసు విరిగెనేని మరియంట నేర్చునా/ విశ్వదాభిరామ వినురవేమ!"
అనగా ఇనుము విరిగితే దానిని మళ్ళీ మళ్ళీ అతక వచ్చు. కానీ  ఒక్కసారి మనసు విరిగితే అది ముక్కలు ముక్కలు అవుతుంది. వాటిని  మళ్ళీ అతకడం అసాధ్యం అని అర్థము.
అలా సూటి పోటి మాటలతో మనసు విరిగేలా  చేస్తే జీవితాంతం  ఆ వ్యక్తితో సహజీవనం చేయడం కంటే దుర్భరం ఇంకొకటి ఉండదు. మనుషులుగా ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళ మధ్య దూరం నింగి నేల మధ్య దూరంం,అగాధమంత  అని చెప్పవచ్చు.
 కాబట్టి ఇరువురి ,తోటి మఃఁ కుమధ్య మనసులు దూరం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.
 మనుషులుగా మానవీయ విలువలు గలిగిన వ్యక్తులుగా  మసలుకోవాలి.ఈ"యావై చిత్తేన దూరస్థః సమీపస్థో  హి దూరతః/న్యాయము ట్పఠ్యఫలోని అంతరార్థం ఇదే. ఇది గ్రహించి మసలుకోవాలి. మనమందరం.

కామెంట్‌లు