అపురూపవ్యక్తులు..సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒడిషాలో అడవి కాపలాదారుడు మిత్ర భాను నాయక్.10ఏళ్లలో ఎడారిభూమిని 85 హెక్టార్ల అడవిగా మార్చిన ఘనత అయనది. అందుకే మూడు చిట్టడవులకి మిత్ర భానునాయక్ అన్న పేరు పెట్టి గౌరవించింది ఒడిషా ప్రభుత్వం.
బీహార్ కిచెందిన ఐపిఎస్ అధికారి స్వప్న మేష్రమ్ తన సొంత ఖర్చుతో పోలీసుశాఖ ఉద్యోగుల పిల్లల కోసం క్రెచ్ ని సొంత ఖర్చుతో ఆరంభించింది. 
తిరుచిరాపల్లికి చెందిన  కార్తికేయన్ ఆయన భార్య ఫుడ్ ట్రక్ ద్వారా ఆంబులెన్స్ డ్రైవర్లకు ఆర్మీలో రిటైరైన వారికి ఉచితంగా ఆహారం ఇస్తున్నారు.ఇంటికి పార్శిల్స్ కూడా ఇస్తున్నారుగుజరాత్ లో ఓతండ్రి" నాయనా! పేదలకు పట్టెడన్నం పెట్టాలని ఉంది " అన్న  రెండో రోజున కన్నుమూశాడు.ఆయన మాటలు చెవిలో గింగురుమంటుంటే కొడుకు రాకేష్ బీద గర్భవతులకు ఆహారం ఉచితంగా అందిస్తూ వాసో నగరంలో వృద్ధులకు రోజూ 500మందికి భోజనంపెడుతున్న ధన్య జీవి.
బెంగుళూర్ వాసి అజయ్ తండ్రి జ్ఞాపకార్థం వీల్ ఛైర్ వాకర్,వాకింగ్ స్టిక్ కొని పేదలకు ఉచితంగా పంచుతున్నాడు🌹.
కామెంట్‌లు