సుప్రభాత కవిత : - బృంద
వెలుగునీడల వెన్నెలల్లే 
కలుగు వాడని హాయల్లే 
తెలియరాని  వేడుకేదో 
కలవనున్నది కమ్మగా!

తీయని కోరిక తీరగా 
మాయని మమతల పంటగా 
మదిని నింపెను కమ్మని 
మధుర మోహనరాగమే!

వాడుకగా వచ్చే కలతలు
వేడుకగా మార్చివేసి
వీడక వెన్నంటే ఉంటూ
వేదనలే తరిమే కాలమే!

పలుకని మాటల భావమే 
తెలిపే మౌనము మధురమే!
తెలియని చెలిమిని చేరువగా
కలిపే సమయము వరమే!

నగవే మాయని నగలై
వగపే  ఎరుగని  సుఖమై 
పగలు రేయి సమమై 
నడిపే  కరుణ  దైవమై!

పొడిచే పొద్దుల వెలుగులకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు