పాలఖండ్యాం పాఠశాల సందర్శన

 పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలను మండల విద్యా శాఖాధికారులు అరసాడ రవి, ముల్లు శ్రీనివాసరావులు సందర్శించి, పాఠశాల పనితీరును అభినందించారు. విద్యార్థుల విద్యా స్థాయిని పరీక్షించగా, వారి నుండి చక్కని స్పందన రావడంతో మిక్కిలి సంతృప్తిని వ్యక్తం చేసారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును, విద్యార్ధి మిత్ర కిట్స్ పంపిణీలను పరిశీలించారు. తల్లికి వందనం పథకం నివేదికను పరిశీలించి, లబ్ధిదారులైన కొందరు తల్లులతో చర్చించారు. ఉపాధ్యాయుల కరదీపికలను, విద్యార్థుల వర్క్ బుక్స్, సంసిద్ధతా కార్యక్రమాలను, పాఠశాల పరిసరాలను, టాయిలెట్స్ పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొన్నారు.
కామెంట్‌లు