అత్యంత విశ్వాసపాత్రమైన కుక్క కథ:- - యామిజాల జగదీశ్
 అది 1850వ సంవత్సరం. తోటమాలి జాన్ గ్రే తన భార్య, కొడుకుతో కలిసి పని కోసం ఎడిన్‌బర్గ్‌కు వచ్చాడు. అయితే అతనికి దొరికిన ఏకైక ఉద్యోగం రాత్రి కాపలాదారుడిగా ఉండటం. అదీనూ ఒక షరతు కింద. అతనితో ఎల్లప్పుడూ ఒక కాపలా కుక్క ఉండాలి. అలా "బాబీ" అనే చిన్నపాటి స్కై టెర్రియర్ అతని జీవితంలోకి వచ్చింది.
ఎనిమిది సంవత్సరాలపాటు అతని వెంటే ఉండేదీ కుక్క. ఎంతటి చలి ఐనా, వర్షమైనా అతను తన కాపలా కుక్కతో కలిసి పని చేయవలసి వచ్చేది. 
1858లో, జాన్ క్షయవ్యాధితో మరణించాడు. అతని అంత్యక్రియల సమయంలో, కుక్క తన యజమాని శవపేటికను విడిచిపెట్టడానికి నిరాకరించింది. ఖననం చేసిన తర్వాత, బాబీ కుక్క శ్మశానవాటికను వదిలి వెళ్ళకపోవడాని అందరూ గమనించారు.
పగలు, రాత్రి, ప్రతి సీజన్‌లో, బాబీ జాన్ సమాధి దగ్గరే ఉండేది. శ్మశానవాటిక సంరక్షకుడు దానిని అక్కడి నుంచి తరిమికొట్టడానికి చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ కుక్క వెళ్ళినట్లే వెళ్ళి జాన్ సమాధి వద్దకు తిరిగి వచ్చేది. దాని బాధ భరించలేక చివరికి, సమాధి పక్కన దాని కోసం ఒక చిన్న ఆశ్రయం ఏర్పాటు చేశారు.
కాలక్రమేణా, " బాబీ భక్తి " నగరం అంతటా తెలిసింది.  ప్రతిరోజు మధ్యాహ్నం 1:00 గంటకు, ఎడిన్‌బర్గ్ కోట నుండి ఫిరంగి కాల్పులు భోజన సమయాన్ని సూచిస్తాయి. అది విన్న వెంటనే, బాబీ కుక్క గ్రేఫ్రియర్స్ ప్లేస్ పబ్‌కి పరిగెత్తేది. అక్కడ అది తన యజమాని జాన్ తో కలిసి వెళ్ళే ప్రదేశమిది. అక్కడ అతను ఎల్లప్పుడూ తన కోసం భోజనం వేచి ఉండేది. అదైన తర్వాత, అతను నేరుగా శ్మశానవాటికకు తిరిగి వెళ్ళేది.
ఇంతలో 1867లో, నగరంలోని ప్రతి కుక్కకు లైసెన్స్ పొందాలని, లేకుంటే వాటిని చంపేయాలని కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. అప్పుడు
బాబీ కుక్కకి అధికారిక యజమాని లేకపోవడంతో, ఎడిన్‌బర్గ్ లార్డ్ ప్రోవోస్ట్ సర్ విలియం చాంబర్స్ వ్యక్తిగతంగా దాని జీవితకాల లైసెన్స్ కోసం నగదు చెల్లించి దానిని "నగర ఆస్తి"గా ప్రకటించాడు.
బాబీ కుక్క 1872లో 16 సంవత్సరాల వయస్సులో మరణించే వరకు జాన్ గ్రే సమాధి వద్ద 14 సంవత్సరాలు ఉంది. ఓ ఏడాది తర్వాత, బారోనెస్ ఏంజెలా బర్డెట్-కౌట్స్ దాని గౌరవార్థం గ్రేఫ్రియర్స్ పబ్ సమీపంలో ఓ స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.
అక్కడి శిలా ఫలకంపై ఇలా రాసి ఉంది : “బాబీ, జనవరి 14, 1872న 16 సంవత్సరాల వయసులో మరణించింది. దాని విధేయత, భక్తి మనందరికీ ఒక ఉదాహరణగా ఉండు గాక.” అని.
ఈ కథ ఒక విషయాన్ని రుజువు చేస్తోంది : నిజమైన స్నేహం మరణం కంటే బలమైనది. 

కామెంట్‌లు