అది ఒక పేద కుటుంబం.తల్లిదండ్రులు మరణించారు.పిల్లలు అనాధలైనారు.కొడుకు రాము కూతురు రాధ.చిన్నప్పటినుండి కూలికి వెళ్లి కాలం వెళ్లదీస్తున్నారు.రాము ఒక పూట బడికి ఒక పూట కూలికివెళ్తాడు.బడిలో అందరూ అతన్ని తల్లిదండ్రులు లేనోడని పిల్లలు ఎగతాళి చేసేవారు.ఈ మాటలు తట్టుకోలేక బడి మానివేశాడు.
నేను పనికి వెళ్లి నిన్ను చదివిస్తానంటాడు రాము. సరే అన్నయ్య అనిచెల్లి అంటుంది.తెల్లవారి నుండి రాధ బడికి వెళుతుంది.మీ తల్లిదండ్రులేరని హెడ్మాస్టర్ అడుగుతాడ.మా అమ్మ నాన్నలు ఊరికి వెళ్లారంటుంది రాధ.సరేలే మీ అమ్మానాన్న వచ్చినప్పుడు తీసుకురా అని హెడ్మాస్టర్ అంటాడు. సార్లు చెప్పే పాఠాలు పట్టుదలతో వింటుంది.ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్యకు నేర్చుకున్న విషయాలు చెబుతుంది.రాముకు కూడా నేను బడి మానివేశాను అన్న బెంగ తొలగిపోతుంది.
ఒకరోజు హెడ్మాస్టర్ పేరెంట్స్ మీటింగ్ పెట్టాడు.రేపు మీ అమ్మానాన్నలను తీసుకురావాలని రాధతో అంటాడు.రాధ ఇంటి వద్దనే ఆలోచిస్తూ ఉండిపోయింది.బడికి వెళ్లలేదు.రాధ ఇంకా బడికి రాలేదు ఏమైందని హెడ్మాస్టరు ఆలోచిస్తాడు.వాళ్లను వీళ్లను అడుగుకుంటూ రాధ ఇంటికి వెళ్తాడు. హెడ్మాస్టర్ ను చూసి రాము,రాధ ఇద్దరు నమస్కారం చేస్తారు.రాధ ఎవరో కాదు సార్ నా చెల్లెలనిఅంటాడు.అయ్యో! రాము నాకు ఇంతవరకు ఈ విషయం తెలియలేదని హెడ్మాస్టర్ అంటాడు. రాధ వచ్చి గురువుగారికి పాదాభివందనం చేస్తుంది.నన్ను క్షమించండి సార్! అమ్మానాన్నలున్నారని అబద్ధం చెప్పాను.గురువుగారు రాధను గుండెకు
అత్తుకుంటాడు.ఎంత పెద్ద మనసమ్మా నీది.ఎంత బాధను గుండెలోదాచుకున్నావని హెడ్మాస్టర్ ఓదార్చుతాడు. నీవు చదువుకుంటూ మీ అన్నయ్యకు చదువు చెప్తున్నావు. నీ తెలివిని నేను మెచ్చుకుంటున్నాను అని అంటాడు.ఇప్పటినుండి మీరు అనాధలు కాదు. నా పిల్లలు.మిమ్ములను చదివిస్తాను. గొప్ప వారిని చేస్తానని హెడ్మాస్టర్ మాట ఇస్తాడు.అదే ప్రకారంగా రాము,రాధను గొప్పగా చదివిస్తాడు.పై చదువులు చదివి రాము డాక్టర్ అవుతాడు.రాధ టీచరు అవుతుంది.రాము అనాధ పిల్లల కోసం ఉచిత వైద్య సేవలు చేస్తాడు.అనాధ పిల్లలకు ఆసుపత్రి కట్టిస్తాడు.పేద విద్యార్థులకు హాస్టల్స్ కట్టిస్తుంది రాధ.ఇలా వీరి సేవలు సమాజానికి ఉపయోగిస్తున్నారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి