14స్ఫూర్తిదాతలు..సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 గుజరాత్ లో బాగా ఎండలు ఉండే ప్రాంతంలో రైతుల కోసం పంట పొలాలకు నీరు తెచ్చే కాలువలపై సోలార్ ప్యానల్స్ అమర్చారు అలా విద్యుత్తు ఉత్పత్తి బాగా జరుగుతుంది నర్మదా కెనాల్పై లక్ష 16 వేల సౌరఫలకాల నుంచి మూడు కోట్ల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది ఇలా అన్ని రాష్ట్రాలు కాలువలు నదులపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తే నీరు చల్లగా ఉంటుంది విద్యుత్తు ఆదా అవుతుంది తమిళనాడులో కారైకుడి పట్టణం నుంచి సంతుసాలై అనే రోడ్డు వేసి 96 ఏళ్ళు దాటింది బ్రిటిష్ వారి కాలంలో వేశారు చెట్టినాడు ఇల్లు నిర్మించిన మేస్త్రీలు దీని నిర్మాణంలో గొప్ప పనితనం చూపారు నల్ల బెల్లం ఆవాలు సున్నపురాయి వాల్నట్ బెరడుతూ దీన్ని నిర్మించారు పక్కాగా ఉన్న హెరిటేజ్ సిటీ కారేకుడిని చూడటానికి విదేశీయులు వస్తారు భారీ వాహనాలు తిరుగుతున్న ఈ రోడ్డు చెక్కుచెదరలేదు కొత్త రోడ్డు వేస్తామని తార రోడ్డు వేస్తామని ప్రభుత్వం అన్న మాకు అవసరం లేదు అని ఎదురు తిరిగారు అక్కడి ప్రజలుప్రముఖ ఐటీ సొల్యూషన్స్ సంస్థ దాని వ్యవస్థాపకుడు సిద్అహ్మద్ తమిళనాడులో తిరుచిలో  పూరి గుడిసెలో నివసించిన ఆరుగురు పిల్లల్లో ఇతను ఆఖరివాడు అమ్మానాన్న చాలా కష్టపడ్డారు తండ్రి డ్రైవర్గా చేరాడు బిఎస్సి చదివిన సిద్ కంప్యూటర్ సైన్స్ లో చేరాడు కానీ తండ్రి చనిపోవడంతో కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సేల్స్ మాన్ గా చేరాడు స్కూల్ లోకి వెళ్లి కంప్యూటర్ల గురించి వివరించి నెలకి 1200 రూపాయలు జీతంతో బతుకు సాగించాడు అన్న పట్టుదలతో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్ళాడు తిరుచి నుంచి విదేశాలకు ఎవరూ రావటం లేదని గమనించి విడార్ట్ పేరుతో రిక్రూట్మెంట్ కంపెనీని నెలకొల్పాడు తిరుచిలో ఐదుగురితో మొదలుపెట్టిన ఇతని సంస్థ మెంటరింగ్ లెర్నింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులతో ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో కూడా శిక్షణ ఇచ్చాడు ఆ సంస్థలో ఇప్పుడు 5000 మంది పైగా ఉద్యోగాలు చేస్తున్నారు ఆడవారి కోసం గ్లోబల్ వుమెన్ లీడర్ షిప్ అనే కార్యక్రమం మొదలుపెట్టాడు కోవిడ్ సమయంలో సంస్థ నుంచి ఎవరిని తొలగించలేదు జీతాలు కూడా ఇచ్చాడు మోటివేషనల్ స్పీకర్ గా సిద్ నేడు అందరి మన్ననలు పొందుతున్నాడు పశ్చిమ బెంగాల్ లో పట్కాపారా అనే గ్రామంలో జనాలు పాచి పనులు పాకి పనులు చేసేవారు చెరువులు నీళ్లు లేక పోవడంతో అందరూ కలిసి వంతులు వారీగా చెరువుల పూడిక తీశారు మూడు నెలల్లో మూడు చెరువులని బాగు చేసి రెండు వందల ఎకరాల నీ సాగులోకి తెచ్చారు చేపలు కూడా బాగా వృద్ధి చెందాయి ఇక మహారాష్ట్రలోని ఐదు గ్రామాల్లో 8 నెలలు పాటు కనీస అవసరాలకి నీళ్లు ఉండేవి కావు స్త్రీలు మైళ్ళకు మైళ్ళు నడిచి నీరు తేవాల్సిన పరిస్థితి అక్కడి యువత కుంటల్ని బాగు చేసి ప్రతి ఊళ్లో రెండు చిన్న చెరువులు తవ్వారు ప్రతి వాన చుక్క అందులోకి వెళ్లేలా తూములు కట్టారు అలా వర్షపు నీటితో వీధికి ఒక కమ్యూనిటీ ట్యాంకు ఏర్పాటు చేశారు ప్రతి వీధిలో నేడు నల్లాలు వచ్చాయి🌹
కామెంట్‌లు