కొత్తూరు రచయితల వేదిక ఏడో నెల సమావేశం ఈనెల 26న ఆదివారం ఉదయం 9గంటలకు ఏర్పాటు చేసినట్లు వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు తెలిపారు. స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనంతో పాటు తెలుగు పుస్తకాల ఉచిత పంపిణీ కూడా జరుగుతుందని ఆయన అన్నారు. కార్యవర్గ సభ్యులు ఎవిఆర్ఎం దిలీప్ రాజా పట్నాయక్ రూపొందించిన తెలుగు స్టడీ మెటీరియల్ పుస్తకాన్ని ఈనాటి కార్యక్రమంలో ఆవిష్కరణ జరుగుతుందని, అనంతరం పదోతరగతి విద్యార్థులకు ఉచితంగా బహూకరించనున్నామని శ్రీరాములు తెలిపారు. మండల పరిధిలో గల అన్ని ఉన్నత పాఠశాలకూ చేరేలా, ఒక్కొక్క పాఠశాల నుంచి ఒక్కో విద్యార్ధికి ఈ తెలుగు పుస్తకాలను బహూకరించనున్నామని ఆయన తెలిపారు. 85పేజీలతో రూపొందించిన ఈ పుస్తక రూపకర్త ఎవిఆర్ఎం దిలీప్ రాజా పట్నాయక్ మాట్లాడుతూ ప్రతి ఉన్నత పాఠశాల నుండి పదో తరగతికి చెందిన ఒక బాలిక లేదా ఒక బాలుణ్ణి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పంపించేలా సహకరించాలని కోరారు. అనంతరం వేదిక ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి సమన్వయంతో జరుగనున్న కవి సమ్మేళనంలో వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు, ఉపాధ్యక్షులు ముదిల శంకరరావు, ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి, సహ కార్యదర్శి గడసాపు ఉషారాణి, కోశాధికారి వైశ్యరాజు హరనాథరాజు, కార్యవర్గ సభ్యులు ఎవిఆర్ఎం దిలీప్ రాజా పట్నాయక్, గేదెల మన్మధరావు, పల్ల నారాయణరావు, పెదకోట ధనుంజయరావు, డా.ఎన్ను అప్పలనాయుడు, బాణాన రమణమూర్తి, గజిబిల్లి మోహనరావు, కలమట గోవిందరావు, గూనాపు శార్వాణి, బూడిద సంతోష్ కుమార్, పొన్నాన వెంకటరమణలు తమ కవితా గానం వినిపించనున్నారు.
కొత్తూరు రచయితల వేదిక సమావేశం 26న
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి