4స్ఫూర్తిదాతలు ...సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 పల్లెల్లో  కావాల్సిన వస్తువు త్వరగా దొరకదు దానికి పరిష్కారం సందీప్ దేశ్ముఖ్ కనిపెట్టాడు పూణేకి సమీపంలో ఉన్న బుల్ దాన లో పుట్టిన అతను బీటెక్ చేసి అమెజాన్ ఇతర సంస్థల్లో పని చేశాడు పెద్ద సంస్థలు తమ సరుకుల్ని తేలిగ్గా పల్లెలకు చేరే మార్గం గురించి ఆలోచించాడు సౌరబ్నిగం క్షితిజ బన్సాల్ అనే ఇద్దరితో కలిసి ఎలాస్టిక్ రన్ అనే వ్యాపారం మొదలుపెట్టాడు కిరాణా వ్యాపారులు కదలకుండానే 300 రకాల బ్రాండ్లలో తమకు కావలసిన వస్తువులను క్లిక్ చేస్తే ఆ సంస్థ వచ్చి వారికి అందజేస్తుంది ఇలా వ్యాపారులకి సరుకుల బ్రాండ్లకి ఉభయతారకంగా పనిచేస్తూ 5000 కోట్ల వ్యాపారం చేస్తున్నాడు సందీప్ మనసుంటే మార్గం ఉంది కి ప్రత్యక్ష సాక్షి అతనుస్వప్నిల్ వెంకటేష్ అనే ఇద్దరు ఉప్పు కన్నా గాలిలో తేమను బాగా పీల్చుకొని సిలికాజల్ క్యాల్షియం క్లోరైడ్ తో నీటిని తయారు చేయటం ఓ ప్రత్యేకత ఉరవ ల్యాబ్స్ అనే సంస్థను స్థాపించి గాలి నుంచి నీటిని తయారు చేసి హోటల్ హాస్పిటల్ కి సప్లై చేస్తున్నారు కరువు ప్రాంతాల్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఉపయోగం వాహనాలు చెడిపోతే లేక డీజిల్ అయిపోతే చాలా కష్టంరెపోస్  ఎనర్జీ అనే
 సంస్థ మన సైన్యానికి కూడా మొబైల్ పెట్రోల్ పంపుల్ని అందిస్తోంది దీని కారకులు అదితి చేతన్ అని ఆలుమగలు పూనాకు చెందిన వీరు ఎంతో శ్రమించి అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానును కలిసి తమ ఆలోచన చెప్పారు ఆయన ప్రోత్సాహంతో రెపోసి ఎనర్జీ అనే సంస్థను స్థాపించి పూణేలో ఓ ప్లాంట్ ను నెలకొల్పి మొబైల్ పెట్రోల్ పంపులు తయారు చేస్తున్నారు డీజిల్ కూడా సరఫరా చేస్తున్నారు రతన్ టాటా ప్రశంసలు పొందారు ఆ దంపతులు ముంబై నాగపూర్ హైదరాబాద్ తో సహా 300 నగరాలకి ఈ సంస్థ డీజిల్ అందించటం విశేషందివ్యాంగుల పాలిటి దేవుడు శంకర్ జైకిషన్. భార్య జయ తోడ్పాటుతో 1990నుంచి రెట్రోఫిట్ సేవలను అందిస్తున్న ఈయన  ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేశారు.ఎన్నో మెకానికల్ షెడ్లలో పనిచేసి దివ్యాంగులకు ఊరట కల్గిస్తూ అందరిమన్ననలు పొందుతున్న ధన్యజీవి.శ్రీవారి ఫౌండేషన్ అనే సంస్థను నెలకొల్పిన శంకర్ జైకిషన్ దివ్యాంగుల పాలిటి దేవుడు.🌹 
కామెంట్‌లు